ఆచార్య మరోసారి వాయిదా పడనుందా..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటించిన సినిమాలలో ఆచార్య సినిమా ఒకటి. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.  ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. రామ్ చరణ్ సరసన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో  చిరంజీవి, రామ్ చరణ్ లు నక్సలైట్ లుగా కనిపించబోతున్నారు.  ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.


ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను  ఫిబ్రవరి 4 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది. అయితే ఈ సినిమా విడుదలకు ఇంకా నెల రోజులు కూడా లేదు. కానీ దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతూ ఉండడంతో అనేక రాష్ట్రాలలో ఇప్పటికే థియేటర్ లపై ఆంక్షలు పెట్టడం మొదలుపెట్టారు.  కొన్ని రాష్ట్రాలలో నైట్ కర్ఫ్యూ వల్ల సెకండ్ షో లు మొత్తానికి నడవడం లేదు. మరి కొన్ని రాష్ట్రాలలో 50% ఆక్యుపెన్సీ తో మాత్రమే సినిమా థియేటర్ లు నడుస్తున్నాయి. అయితే ఇలాంటి సందర్భంలో ఆచార్య సినిమా ఫిబ్రవరి 4 వ తేదీన విడుదల కావడం కష్టమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఆచార్య చిత్ర బృందం చెప్పిన తేదీ అయిన ఫిబ్రవరి 4 వ తేదీన విడుదల అవుతుందా,  లేక కరోనా వల్ల వాయిదా పడుతుందా తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: