కరోనా మహమ్మరి ఇప్పుడు అందరిని కబలిస్తుంది. ఒకవైపు వ్యాక్సిన్ వేసుకున్నా కూడా
కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుపోతుంది.. ఇటీవల కాలంలో చాలా మంది
కరోనా తో పోరాడి ప్రాణాలను కొల్పొయారు.సినీ పరిశ్రమలో
కరోనా కలకలం రేపుతోంది. టాలీవుడ్, బాలీవుడ్,
కోలీవుడ్ అనే తేడా లేకుండా సినీ రంగానికి చెందిన నటులు
కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, తమన్, కోలీవుడ్‌కు చెందిన చియాన్ విక్రమ్, అర్జున్, వడివెలు, వరలక్ష్మీ
శరత్ కుమార్ వంటి వారు
కరోనా వైరస్ బారిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు
బాహుబలి ఫెమ్ కట్టప్ప అలియాస్
సత్యరాజ్ కు కరొన సొకింది.ఇటీవల
కరోనా పరీక్షలు చేయించుకోగా సత్యరాజ్‌కు
కరోనా పాజిటివ్ గా వచ్చింది. దీంతో ఆయన అప్పటి నుంచి ఒంటరిగా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే.. గత రాత్రి
సత్యరాజ్ పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే ఆయన్ను చెన్నైలోని అమింజిక్కరైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టం గా మారిందని వైద్యులు ద్రువీకరించారు..ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యంపై అప్‌డేట్ రావాల్సి ఉంది.
ఇది ఇలా ఉండగా ఇప్పుడు
త్రిష కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్
మీడియా ద్వారా తెలియజేశారు. '
కరోనా నియమాలు పాటిస్తున్నా.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొత్త ఏడాదికి కొంచెం ముందు నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. మీకు తెలిసిన అన్ని లక్షణాలు నాకు ఉన్నాయి. అయినా కానీ ఆ వారాలు నాకు చాలా బాధ కలిగించాయి. ప్రస్తుతానికి నేను కోలుకొంటున్నాను. వాక్సినేషన్ వలన ఈరోజు నేను బావున్నాను. దయచేసి అందరు వాక్సిన్ వేయించుకొని.. మాస్క్ వేసుకోండి.. త్వరలోనే ఇంటికి వస్తాను.. నా కోసం వెయిట్ చేస్తున్న అందరికి కృతజ్ఞతలు తెలిపారు.