పుష్పా ఓటిటి.. అక్కడ లేనివి ఇక్కడున్నాయట?
ఇక సినిమా చూస్తున్న ప్రేక్షకులందరినీ కూడా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లడంలో అటు దర్శకుడు సుకుమార్ విజయం సాధించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక భారీ వసూళ్లు రాబట్టిన సినిమా రికార్డులను క్రియేట్ చేసింది అని చెప్పాలి. ఇంకా థియేటర్లకు వెళ్లి పుష్ప సినిమాను చూసేందుకు ఎంతో మంది అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. అయితే గత ఏడాది డిసెంబర్ 17వ తేదీన విడుదలైన పుష్ప ఇటీవలే జనవరి 7వ తేదీన ఓటిటి లో విడుదల చేశారు. అమెజాన్ ప్రైమ్ వేదిక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన పుష్ప మరింత స్పెషల్ గా ఉంది అన్నది ప్రస్తుతం అర్థమవుతుంది.
అయితే థియేటర్లో సినిమా కి ఇటూ ఓటిటి లో విడుదలైన సినిమాలో కొన్ని సన్నివేశాలు చూడని ఉన్నాయి అన్నది అర్ధమవుతుంది. ఓటిటి వర్షన్ లో కొన్ని అనవసరమైన సన్నివేశాలను తీసేసి థియేటర్లో ప్రేక్షకులు చూడరని సన్నివేశాలను యాడ్ చేసినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా సమంతా స్పెషల్ సాంగ్ కు సంబంధించి కూడా కొన్ని విజువల్స్ యాడ్ చేసినట్లు తెలుస్తోంది.. ఇలా థియేటర్ లో ప్రేక్షకులను అలరించిన పుష్ప కంటే ఇక ఓటిటి లో విడుదలైన పుష్ప మరింత కొత్తగా ప్రేక్షకులను అలరిస్తుందని కొత్త సన్నివేశాలు ప్రేక్షకులందరినీ కూడా కట్టిపడేస్తాయి అన్నది అర్ధమవుతుంది. ఇది ఓటిటి వీక్షకులకు మాత్రం ఒక సర్ప్రైజ్ అనే చెప్పాలి.