" data-original-embed="" >
మనసుంటే మార్గాలు వెయ్యి అంటుంటారు మన పెద్దోళ్లు. అదే ప్రేమ ఉంటే ఆ మార్గాలు వెయ్యి నుండి లక్షకు, అంతకుమించి పెరుగుతాయి అని చెప్పొచ్చు..
ఇలాంటి మార్గాలను మరియు ఆ ప్రేమను ఎలాంటి కరోనా కూడా ఆపలేదు. ఇంతింత పెద్ద మాటలు చెబుతున్నారేంటి అబ్బా అనుకుంటున్నారా? తన భార్య విషయంలో కుర్ర హీరో నితిన్ చూపించిన ప్రేమను చూస్తే మీరు కూడా ఇంతకుమించి ఎక్కువగానే మాట్లాడతారు. కావాలంటే ఓసారి నితిన్ రీసెంట్ ట్వీట్ చూస్తే మీకే తెలుస్తుంది. భార్య మీద ప్రేమను ఎంత అందంగా ప్రదర్శించాడో చూడండి..
నితిన్ భార్య షాలినికి ఇటీవల కరోనా సోకిందట. దీంతో ఆమె ఇంట్లోనే ప్రత్యేక గదిలో ఐసోలేషన్లో వుంటున్నారని సమాచారం.. ఈ రోజు ఆమె జన్మదినం కావడంతో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారట.. ఎవరైనా ఇలానే అనుకుంటారు కానీ కరోనా ఉన్నప్పుడు ఎలా చేసుకుంటారు కానీ దానికి నితిన్ అండ్ కో. కి మంచి ఆలోచన వచ్చింది. అదే డిస్టన్స్ సెలబ్రేషన్. అవును ఆ వీడియోలో నితిన్ చేసింది అదే. ఆయన చూపించిన ప్రేమ అదే.
భార్య ఎదురుగా మేడపైన గది నుండి కిటికీ దగ్గర నిల్చుని చూస్తుంటే క్రింద లాన్లో నితిన్ ఆమె బదులు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశాడట.. ఆ వీడియో ఇప్పుడు బాగా వైరల్గా మారింది. ఈ వీడియో చూడటానికి సాధారణంగా కనిపించొచ్చు కానీ, కరోనా కుటుంబాల్ని మరియు బంధాల్ని ఎంత ఇబ్బంది పెడుతోందో తెలుస్తోంది. ఇంతకుమించన కష్టాలు మనం గత కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాము అనుకోండి. రీసెంట్ వీడియో కాబట్టే ఇదంతా. కేక్ కట్చేసినప్పుడు, ఆ తర్వాత దాన్ని అలా నితిన్ గాల్లో చూపిస్తున్నప్పుడు ఆ ముఖంలో ఎంతో ప్రేమ కనిపిస్తోంది.
భార్యకు దూరంగా ఉన్నాడనే బాధ కూడా కనిపిస్తోంది. కేక్ తిని. అద్భుతంగా ఉంది అంటూ భార్యను ఊరడించే ప్రయత్నం కూడా చేశాడు నితిన్. ఈ వీడియోను యువ దర్శకుడు అయిన వెంకీ కుడుమల షూట్ చేసినట్లు కూడా చెప్పాడట నితిన్. కరోనాకు బేరియర్స్ ఉన్నాయి కానీ ప్రేమకు లేవు. హ్యాపీ బర్త్డే మై లవ్. జీవితంలో మొదటిసారి నువ్వు నెగిటివ్ అవ్వాలని కోరుకుంటున్నా అంటూ నితిన్ తన ట్వీట్లో రాసుకొచ్చాడటా.