పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే లో తెరకెక్కిన సినిమా భీమ్లా నాయక్, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా, దగ్గుబాటి రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. భీమ్లా నాయక్ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనున్ కొషియన్ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.
ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగివున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఆర్ఆర్ఆర్, రాదే శ్యామ్ లాంటి పాన్ సినిమాలను కూడా సంక్రాంతి విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో భీమ్లా నాయక్ సినిమాను కూడా సంక్రాంతి బరిలో నిలిపినట్లు అయితే మూడు నెలల కలెక్షన్ లపై ప్రభావం పడే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో భీమ్లా నాయక్ సినిమాను సంక్రాంతి బరి నుండి తప్పించారు. కాకపోతే కరోనా ప్రభావం వల్ల ఆర్ఆర్ఆర్, రాదే శ్యామ్ సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. అయితే ఈ సంక్రాంతికి సినిమాను విడుదల చేయకపోయినా సంక్రాంతి ఒక అదిరిపోయే మాస్ టీజర్ ను విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ చిత్ర బృందం ప్రేక్షకులకు సంక్రాంతి కానుకగా మరో అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ టీజర్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.