ఇప్పుడు పూరీకి డిమాండ్ పెరుగుతుందేమో..?

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ద‌ర్శ‌కుడు పూరి జగన్నాథ్ ది ప్ర‌త్యేక శైలి అని చెప్పాలి. క‌థానాయ‌కుల పాత్రల‌ను  అప్ప‌టిదాకా చూసిన‌దానికి భిన్నంగా ప్ర‌జెంట్ చేస్తూ స‌రికొత్త మ్యాన‌రిజ‌మ్‌తో ఆయా హీరోల అభిమానుల‌ను మెప్పించ‌డం ఆయ‌న‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. ర‌వితేజ మొద‌లు అమితాబ్ బ‌చ్చ‌న్ దాకా ఆయన డైరెక్ట్ చేసిన విధాన‌మ‌దే.  పోకిరిలో మ‌హేష్ ను ఆయ‌న చూపించిన విధానం ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేయ‌డం మాత్ర‌మే కాదు. అప్ప‌ట్లో ప్రిన్స్‌కు అటు సూప‌ర్ స్టార్ బ్రాండ్‌ను, ఇటు ఇండ‌స్ట్రీ హిట్‌నూ ఏక‌కాలంలో అందించింది. ‌అప్ప‌టిదాకా చిన్న‌చిన్న పాత్ర‌లకే ప‌రిమిత‌మైన ర‌వితేజ‌ను ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌హ్మ‌ణ్యంతో హీరోగా మార్చి, ఆ త‌రువాత ఇడియ‌ట్, అమ్మానాన్న ఓ త‌మిళ అమ్మాయి వంటి  వ‌రుస హిట్ చిత్రాలిచ్చిన ఘ‌న‌త పూరీ జ‌గన్నాథ్‌ది. ఇక ఇండ‌స్ట్రీలో ద‌ర్శ‌కుడు పూరీకి మాత్ర‌మే సొంత‌మైన ప్ర‌త్యేక‌త ఏమిటంటే ఎంత పెద్ద హీరోతో సినిమానైనా అనుకున్న షెడ్యూల్ ప్ర‌కారం త‌క్కువ రోజుల్లోనే పూర్తి చేసి చూపించ‌గ‌ల‌గ‌డం. ఇప్పుడ‌దే పూరీకి మ‌ళ్లీ వ‌రంగా మారే అవ‌కాశం క‌నిపిస్తోంది.
 
 కొంత‌కాలంగా ఫేడ్ అవుట్ అయి పూరి ఆమ‌ధ్య హీరో రామ్‌తో ఇస్మార్ట్ శంక‌ర్ మూవీతో మ‌ళ్లీ హిట్ కొట్టినా ఆత‌రువాత ఆ తరువాత కోవిడ్ కార‌ణంగా సైలెంట్‌గానే ఉండిపోవాల్సి వ‌చ్చింది.  గ‌త ఏడాది అక్టోబర్‌లో పూరీ త‌న‌యుడు ఆకాశ్ హీరోగా వచ్చిన రొమాంటిక్ చిత్రానికి నిర్మాత‌ల్లో ఒక‌రిగా వ్య‌వ‌హ రించాడు. ఇక కోవిడ్ కార‌ణంగా మ‌రోసారి  థియేట‌ర్లు మూత‌ప‌డే అవ‌కాశం పెరుగుతుండ‌టంతో ఓటీటీని న‌మ్ముకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి. అయితే ఆ వేదిక మీద రిలీజ్ చేయ‌గ‌ల‌గాలంటే సినిమా బ‌డ్జెట్ త‌క్కువలో అయిపోవాలి. అంతేకాదు. త‌క్కువ రోజుల్లో సినిమా తీయ‌గ‌లగాలి కూడా. అదే స‌మ‌యంలో పెద్ద హీరోల‌ను డైరెక్ట్ చేయ‌గ‌ల స్టేచ‌ర్ ఉండాలి. ఇవ‌న్నీ దృష్టిలో ఉంచుకుంటే డైరెక్టర్‌గా పూరీ మ‌రోసారి వెలుగులోకి వ‌చ్చే దండిగానే ఉన్నాయ‌ని చెప్పాలి. ఉండాలి. త‌క్కువ టైమ్‌లో పూర్తి చేస్తే పెద్ద హీరోలు కూడా రెమ్యూన‌రేష‌న్ త‌గ్గించుకుని సినిమాలు చేసే అవ‌కాశ‌ముంది. స్టార్ హీరోల సినిమాల‌కూ ఓటీటీలో ఆద‌ర‌ణ ఎలాగూ బాగానే ఉంటుంది. మ‌రి ఈ దిశ‌గా ప్ర‌య‌త్నాలు ఏమేర‌కు ముందుకు సాగుతాయో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: