టికెట్ల రేట్లు.. నా సినిమాకు ఇబ్బంది లేదు.. ఇదెట్టా న్యాయం నాగార్జున గారు..?
ఇన్ని జరుగుతుండగా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న బంగార్రాజు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏపీలో టికెట్ల రేట్లు తగ్గడం వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు నాగార్జున. తన సినిమా గురించి చెబుతూ టికెట్ల రేట్లు ఎక్కువ ఉంటే కొద్దిగా ఎక్కువ కలక్షన్స్ వస్తాయని.. తక్కువ రేట్ల వల్ల కలక్షన్స్ తగ్గుతాయని. నా సినిమాకైతే టికెట్ల రేట్లు ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు నాగార్జున.
ఇక ఓ సినీ పెద్దగా కేవలం తన సినిమా వరకు ఏపీలో ఉన్న రేట్లు తనకు సరిపోతాయని నాగార్జున చెప్పడం వరకు బాగానే ఉన్నా.. నాగార్జున లానే అందరు తమ దారిలోకే రావాలని ఏపీ ప్రభుత్వానికి ఓ సంధు ఇచ్చిన వాడు అవుతాడు నాగ్. టికెట్ల రేట్లపై పొలిటికల్ కామెంట్స్ చేయడం తనకి ఇష్టం లేదని చెప్పిన నాగార్జున ప్రస్తుతం ఉన్న రేట్లు అయినా తనకు ఓకే అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. అది ఖచ్చితంగా ఇండస్ట్రీకి వ్యక్తిరేకంగా అనిపించే మాటే. మరి ఈ విషయంపై నాగార్జున తర్వాత ఎలా సమర్ధించుకుంటారో ఏమో కానీ ఓ పక్క ఏపీలో టికెట్ల రేట్ల ఇష్యూ ఓ రేంజ్ లో నడుస్తుంటే తనకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదని షాక్ ఇచ్చారు కింగ్ నాగార్జున.