సెన్సిబుల్ అండ్ క్లాసిక్
డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇంకా
కోలీవుడ్ స్టార్
హీరో ధనుష్ కాంబినేషన్ లో ఓ మల్టీలాంగ్వేజ్
సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఇక సినిమాల పరంగా రెండు విభిన్న దృవాలైన ఇద్దరు జాతీయ అవార్డ్ గ్రహీతల యాక్టర్స్ తో కలిసి వర్క్ చేస్తుండటంతో.. ఈ అరుదైన కాంబినేషన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచుతుడైన
హీరో ధనుష్.. ఈ సినిమాతో
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తారని కూడా అందరూ చెప్పుకున్నారు.అయితే అప్పుడెప్పుడో ప్రకటించిన
శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి..ఇక
సితార ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ లో
వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సార్' అనే సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లారు ధనుష్. ఇది తన తెలుగు డెబ్యూగా పేర్కొన్నారు. ముందుగా
వెంకీ ద్విబాషా సినిమాని ప్రారంభించడానికి కారణం..
శేఖర్ కమ్ముల స్క్రిప్ట్ వర్క్ ఇంకా కంప్లీట్ చేయకపోవడమే అనే సమాచారం వినిపిస్తోంది.
అలాగే
ధనుష్ కోసం
శేఖర్ కమ్ముల పొలిటికల్
థ్రిల్లర్ కథని కూడా రెడీ చేస్తున్నారు. తెలుగు తమిళ
హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ
సినిమా కోసం నేచురల్
బ్యూటీ సాయి పల్లవి ని
హీరోయిన్ గా తీసుకుంటారని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. ఇప్పటికే సాయి పల్లవితో 'ఫిదా' 'లవ్ స్టోరీ' వంటి రెండు బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు
డైరెక్టర్ శేఖర్ కమ్ముల.అందులోనూ 'మారి 2' సినిమాలో
ధనుష్ ఇంకా
సాయి పల్లవి ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదరడంతో..
శేఖర్ కమ్ముల మూడోసారి ఆమెనే రిపీట్ చేస్తారని కూడా అందరూ భావించారు. అయితే ఈ సారి మాత్రం దర్శకుడు ఈసారి సాయి పల్లవిని తీసుకోకుండా... వేరే నటిని తీసుకోవాలని అనుకుంటున్నారట. పాన్
ఇండియా సినిమా కావడంతో నార్త్ లో క్రేజ్ కోసం
బాలీవుడ్ స్టార్
హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారట.