తగ్గేదేలే అంటున్న ఎన్టీఆర్.. ఒకేసారి డబుల్ డోస్?

praveen
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం స్టార్ హీరో గా కొనసాగుతున్నారు. అయితే ఎప్పుడూ వరుస సినిమాలతో అభిమానులను అలరించే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత మూడేళ్ల  నుంచి మాత్రం సినిమాలకు దూరమయ్యాడు. ఎన్టీఆర్ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. దీంతో అభిమానులు అందరూ నిరాశలో మునిగిపోయారు. దీనికి కారణం జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా చేయడమే. రాజమౌళి సినిమా చేస్తున్నాడు.. ఎలాగో మా అభిమాన హీరో ఎన్టీఆర్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది.. పర్లేదులే కొన్ని రోజుల వరకు వెయిట్ చేద్దాం.. ఆర్.ఆర్.ఆర్ సినిమా వచ్చిన తర్వాత వరుసగా సినిమాలు చేస్తాడులే అని అనుకున్నారు అందరు అభిమానులు.


 కానీ అదిగో విడుదల అవుతుంది ఇదిగో విడుదల అవుతుంది అని అనుకోవడం తప్ప రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలయ్యింది లేదు ప్రేక్షకుల కోరిక తీరింది లేదు. ఇటీవలే జనవరి 7వ తేదీన విడుదల అవుతోంది అనుకొన్న ఆర్ఆర్ఆర్ సినిమా మరోసారి వాయిదా పడింది. ఎప్పుడు విడుదల అవుతుంది అన్న దానిపై కూడా క్లారిటీ లేదు. ఒకవేళ కరోనా వైరస్ ప్రభావం పెరిగింది అంటే ఇక సినిమా విడుదల ఊహించిన దాని కంటే ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీంతో అభిమానులు అందరూ నిరాశలో మునిగిపోయారు. దాదాపు సిల్వర్ స్క్రీన్పై కనిపించే మూడేళ్లు గడిచిపోతుంది. దీంతో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ వాయిదా పడిన నేపథ్యంలో వరుసగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్.



 అభిమానులందరికీ మూడేళ్ల నిరీక్షణ ను ఒకేసారి తీర్చే విధంగా ఏకంగా రెండు సినిమాలతో ఒకేసారి ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తన 30 చిత్రాన్ని త్వరలో మొదలు పెట్టబోతున్నాడు. ఇక ఈ నెలలోనే అటు మరో సినిమా కూడా లాంచ్ చేయబోతున్నాడట. ఉప్పెన సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పిన స్క్రిప్ట్  నచ్చడంతో.. ఈ సినిమా కూడా ఓకే చేశాడట జూనియర్ ఎన్టీఆర్. ఇక ఈ రెండు సినిమాలను ఒకేసారి పట్టాలెక్కించి ఒకే సమయంలో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడట. ఇలా ఇన్నాళ్ల పాటు నిరీక్షణ ఎదురు చూసిన అభిమానులకు వరుస సినిమాలతో ట్రీట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: