షాకింగ్ రామ్ గోపాల్ వర్మకు మెగా కాంపౌండ్ సపోర్ట్ !
ఇప్పుడు లేటెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న టిక్కెట్ల రేట్ల వివాదం పై వర్మ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ 10 ప్రశ్నలు కురిపించాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజలకు తక్కువ రేట్లకే సినిమాలు చూపించాలి అని భావిస్తే ప్రభుత్వాలు నడిపే రేషన్ షాప్ లు లా ప్రభుత్వం భారీ బడ్జెట్ సినిమాలను తాము కొనుక్కుని అతి తక్కువ రేట్లకు సినిమాలను ప్రజలకు చూపిస్తే బాగుంటుంది కదా అంటూ ప్రశ్నిస్తున్నాడు.
అంతేకాదు ఒక ప్రోడక్ట్ తయారుచేసే వ్యక్తికి ఆ ప్రోడక్ట్ పై ఎంత ధర పెట్టాలో అతడికి స్వేచ్చ ఉంటుందని అలాంటి విషయంలో ప్రభుత్వాలు ఎలా తల దూరుస్తాయి అంటూ ప్రశ్నిస్తున్నాడు. అదేవిధంగా కార్లు ఎయిర్ కండిషన్స్ ఫ్రిజ్ లు లాంటి వస్తువులను ప్రభుత్వాలు ఫలానా ధరకు మాత్రమే అమ్మాలి అని శాసిస్తే ఆ మల్టీ నేషనల్ కంపెనీలు మనదేశంలో వ్యాపారాలు చేయగలవా అని ప్రశ్నిస్తున్నాడు.
ఇప్పుడు ఈ ప్రశ్నలకు మెగా బ్రదర్ నాగబాబు సపోర్ట్ లభించడమే కాకుండా వర్మ పై నాగబాబు ప్రశంసలు కురిపించాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఫిలిం ఫంక్షన్ లో రామ్ గోపాల్ వర్మ పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన నాగబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకుని వర్మ పై ప్రశంసలు కురిపించడం చూస్తుంటే భవిష్యత్ లో వర్మకు అన్నివిధాల మెగా కాంపౌండ్ సపోర్ట్ గా నిలబడుతుంది అన్న సందేహాలు కలగడం సహజం..