జగనన్న: సంక్రాంతికి దారేది? పొలిటికల్ షో!

RATNA KISHORE
రాజ‌కీయం అన్నాక చాలా ఉంటాయి.అందులో సినిమా ఉంటుంది.సినిమావాళ్ల పారితోష‌కాలు ఉంటాయి.అంతేనా! ఇంకా ఏవేవో ఎన్నెన్నో ఉంటాయి.అవ‌న్నీ వ‌ద్ద‌నుకుని రాజ‌కీయం చేత‌గాకే కొంద‌రు ప్ర‌త్యామ్నాయ దారుల్లో ప్ర‌త్య‌ర్థుల‌ను దెబ్బ‌కొట్టేందుకు తెగ ప్ర‌య‌త్నిస్తుంటార‌న్న‌ది నిర్వివాదాంశం.క‌నుక ఆంధ్రావ‌నిలో రాజ‌కీయం సినిమా చుట్టూ, సినిమా వాళ్ల రేప‌టి జీవితాలు అన్నీ అమ‌రావ‌తి అన్న‌య్య చుట్టూ న‌డుస్తాయి.పరుగులు తీస్తాయి.ఆఖ‌రికి ఏదో ఒక‌టి చేసి ఏదో ఒక ఒడ్డుకు చేరుతాయి.దిస్ ఈజ్ వాస్త‌వం.

జ‌గ‌న్ త‌రువాతే ఎవ్వ‌రయినా? ఇంత‌గా ప‌ట్టుబ‌ట్టి థియేట‌ర్లు మూయిస్తున్న ఘ‌న‌త ఆయ‌నొక్క‌రిదే! పోనీ ఈయ‌న పెట్రోల్ కల్తీని, ఆహార ప‌దార్థాల క‌ల్తీని ఏమ‌యినా నిలువ‌రించ‌గ‌ల‌రా? ఎంచ‌క్కా సముద్ర మార్గం ద్వారా పోతున్న స‌ర్కారు బియ్యాన్ని ప‌ట్టి, త‌రువాత బాధ్యుల‌పై ఏమ‌యినా చ‌ర్య‌లు తీసుకోగ‌ల‌రా? ఏం చేయ‌గ‌ల‌రు అని?


సినిమా వాళ్లే టార్గెట్
ఎందుకంటే వాళ్ల‌కు భ‌యం
తామేమ‌యిపోతామో అని
అందుకే వాళ్లు ఎదిరించ‌రు
ఆ చేత‌గాని త‌నం కార‌ణంగానే
ఏపీ స‌ర్కారు తాను ఒక్క మెట్టు కూడా
దిగ‌నంటూనే చెబుతోంది



అనుకున్న‌దాని క‌న్నా ఎక్కువ‌గానే సాధించి త‌రువాత  రాజీ ప్ర‌య‌త్నాలేవో మొద‌లుపెడితే దిగి వ‌చ్చే బాప‌తు అయితే జ‌గ‌న్ కా దు.ఆయ‌న‌కు వైజాగ్ లో ఓ స్థ‌లం కావాలి అని స‌మాచారం.అదేదో సురేశ్ బాబు ఇవ్వాలి కానీ ఆయ‌న ఇవ్వ‌రు.కానీ సీఎంకు మా త్రం భీమిలొడ్డునో లేదా మ‌రోచోట‌నో మంచి విల్లా కావాలి..వాటికి అనుగుణంగా చేస్తు న్న రాజ‌కీయంలో భాగంగా సురేశ్ బాబు అనే నిర్మాత‌తో ఎప్ప‌టి నుంచో క‌య్యం ఆడుతున్నాడు సాయిరెడ్డి. కానీ ఎందుక‌నో వ‌ర్కౌట్ అవ్వ‌డం లేదు.అంతేకానీ ఆయ‌నకు పేదలకు వినోదం,పేద‌ల కోసం వినోదం అన్న‌వి ప‌ట్టింపులో ఉన్న విష‌యాల‌ను అనుకుని తీర‌డ‌మే వ్య‌ర్థం..వ్య‌థ కూడా!

సంక్రాంతి అంటే సినిమా అల్లుళ్లే కాదు ముగ్గుల సంద‌ళ్లే కాదు.సంక్రాంతి అంటే ఒక్క‌టంటే ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా.వేడివేడి పిండి వంటలు,భోగి మంట‌ల సంద‌ళ్లే కాదు. సంక్రాంతి అంటే ఓ పెద్ద సినిమా పెద్ద‌ల పండుగ‌తో పాటు చూడ ముచ్చ‌ట.సినిమా అంటే న‌లు గురి ఆనందం.న‌లుగురితో ఆనందం.ఇది కూడా ఇవాళ మ‌రిచిపోయి,ఆ పాటి సోయి కూడా లేకుండా ప్ర‌వ‌ర్తించే మ‌నుషుల ద‌గ్గ‌ర మనం ఏమౌతున్నామని! నాయ‌కులు క‌నీస మాన‌వ‌త్వం మ‌రిచి ఏకంగా ఓ ల‌క్ష కుటుంబాల బ‌తుకుల‌కు భ‌రోసా లేకుండా చేసి ఏం సాధిస్తార‌ని?

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: