నాగార్జునకు ఉపకారం చేసిన ఆర్ ఆర్ ఆర్ !
ఈ పరిస్థితులను క్యాష్ చేసుకుని ‘భీమ్లా నాయక్’ ముందుకు వస్తుందని భావించారు. అయితే ఈమూవీ వాయిదా పడటంతో ఈమూవీకి సంబంధించిన చిన్నచిన్న పెండింగ్ వర్క్ లు కూడ వాయిదా వేసారు. దీనితో ఇప్పుడు హడావిడిగా ఈ పనులన్నీ పూర్తి చేసి సంక్రాంతి రేస్ కు రావడం కంటే ఈ టిక్కెట్ల వ్యవహారం ఒక కొలుక్కు వచ్చిన తరువాత ఈ మూవీని విడుదల చేయడం మంచిది అన్న అభిప్రాయంలో మేకర్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీనితో టాప్ హీరోలకు సంబంధించి ఒక్క ‘బంగార్రాజు’ కు తప్ప మరే సినిమాకు అవకాశాలు మెరుగ్గా లేవు. ఈసినిమాను కేవలం 50 కోట్ల పెట్టుబడితో పూర్తి చేయడంతో తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలకు సంక్రాంతి సినిమాల పై ఉన్న మ్యానియాతో తమ పెట్టుబడిని కేవలం ఒక్క వారంలో వెనక్కు తెచ్చుకోవచ్చు అన్న దృష్టిలో నాగార్జున ఆలోచనలు ఉన్నట్లు టాక్.
తెలుస్తున్న సమాచారం మేరకు ఈవారంలోనే ఈమూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన రావడంతో పాటు ఈమూవీ ప్రమోషన్ ప్రారంభం అవుతుంది అంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతానికి ధియేటర్లు మూతపడే విధంగా పరిస్థితులు లేవు. నాగ్ సినిమాకు ఒక్క తెలుగు రాష్ట్రాలలో తప్ప మరెక్కడా చెప్పుకోతగ్గ మార్కెట్ లేదు. ఇలాంటి పరిస్థితులు చాల తెలివిగా నాగ్ తనకు అనుకూలంగా మార్చుకుని మరొకసారి సంక్రాంతి విన్నర్ అవ్వడానికి వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్నాడు..