కరోనా ప్రభావం వల్ల థియేటర్ లలో విడుదలైన సినిమాలు కొంత కాలానికి ఓటిటి లోకి వచ్చేస్తున్నాయి. అయితే తాజాగా థియేటర్ లలో విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్న 83 సినిమా ఓటిటి లోకి రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. అసలు విషయంలోకి వెళితే.. క్రికెట్‌లో భారత దేశానికి మొదటి ప్రపంచకప్ అందించిన టీం కెప్టెన్ కపిల్ దేవ్ జీవిత కథతో వచ్చిన సినిమా 83. రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ లలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా విడుదలైన మరుసటి రోజే కరోనా కేసుల కారణంగా ఢిల్లీలోని థియేటర్ లను మూసి వేశారు. దీనితో ఈ సినిమా కలెక్షన్ లపై ప్రభావం పడింది. అయితే ఈ చిత్ర బృందం అనుకున్నట్లే గానీ మొదటి రోజే 15 కోట్ల వసూళ్లను సాధించింది. అనంతరం ఆ కలెక్షన్ లు తగ్గుతూ వచ్చాయి. ఓమిక్రేన్ కేసుల వల్ల ఇతర రాష్ట్రాల థియేటర్ లపై కూడా ఆంక్షలు విధించే అవకాశాలు కనబడుతున్నాయి. దీనితో ఈ మూవీ ఓటిటి విడుదలవనుందని రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. దీనిపై ఈ మూవీ డైరెక్టర్ కబీర్ ఖాన్ స్పందించాడు.
కబీర్ ఖాన్ మాట్లాడుతూ.. 18 నెలల క్రితమే ఈ మూవీ సిద్ధమైంది. ఇది వెండితెరపై చూడాల్సిన సినిమా అని అనుకున్నాం. ఓటిటి సంస్థల నుండి ఆఫర్ లు వచ్చినా కూడా అటువైపు వెళ్లలేదు. ఆ తర్వాత ఈ సినిమా థియేటర్ లలో విడుదల చేశాం. కానీ విడుదలైన రోజు నుండి కేసులు పెరగడంతో ఢిల్లీలో థియేటర్ లను మూసివేశారు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. అందుకే ఇంకా ఎన్ని రోజులు ఇలానే ఈ సినిమాను ఆడిస్తామో తెలియదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఓటిటి లోకి వచ్చే అవకాశాల గురించి ఆలోచిస్తాము అని ఈ సినిమా దర్శకుడు కబీర్ ఖాన్ తెలియజేశాడు.