వామ్మో..నీతా అంబానీ తాగే టీ కప్పు ధర అన్ని లక్షలా..?
కేవలం కాఫీ కప్పు ధర మూడు లక్షల రూపాయలు అంటే మిగతా వాటి ధర ఇక ఎంత ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇకపోతే తాజాగా వెలువడిన కథనం ప్రకారం నీతా అంబానీ లైఫ్ స్టైల్ విషయానికి వస్తే ఆమె రోజంతా కొన్ని లక్షల, కోట్ల రూపాయల విలువచేసే విలువైన వస్తువులతోనే తన రోజును గడుపుతుంది అని సమాచారం. అయితే ఆమె ఉపయోగించే వస్తువుల ధరల విషయానికి వస్తే.. ప్రతిరోజు భోజనం చేసే డైనింగ్ టేబుల్ కోసం కోటిన్నర రూపాయలు ఖర్చు చేశారట. ఎందుకంటే బంగారం, ప్లాటినం, డైమండ్స్ తో డైనింగ్ టేబుల్ ను తయారు చేసినట్లు సమాచారం.
అంతేకాదు ఆమె చేతికి ఉపయోగించే గడియారాలు కూడా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి అని సమాచారం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్రాండెడ్ గా గుర్తింపు పొందిన బల్కరీ, గుకీ, కెల్విన్, పార్సెల్ వంటి అత్యంత ఖరీదైన బ్రాండెడ్ వాచ్ లను ఈమె ఉపయోగిస్తుంది అట. ఇకపోతే నీతా అంబానీ ఉపయోగించే హ్యాండ్ బ్యాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రముఖ బ్రాండెడ్ గా గుర్తింపు పొందిన కొన్ని కంపెనీలు తయారు చేసిన హ్యాండ్ బ్యాగ్ లను మాత్రమే ఉపయోగిస్తుందని వాటి స్టార్టింగ్ ధర 40 లక్షల రూపాయలు ఉంటుందని సమాచారం. అంతేకాదు ఈమె ధరించే చెప్పుల విషయానికి వస్తే ఆమె ఒకసారి వాడిన చెప్పులను మళ్లీ ఉపయోగించదట.. ఇక ఆ చెప్పుల ధర అయితే ఏకంగా లక్ష రూపాయలు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈమె లైఫ్ స్టైల్ చూస్తే అందరూ ఆశ్చర్య పోవటమే కాదు కళ్ళు గిట్టని వారు కూడా ఉండరు అని అందరూ అంటూ ఉంటారు.
.