40 లక్షలు టు 4 కోట్లు.. యువ హీరో డిమాండ్ అదుర్స్..!

shami
అవకాశాల కోసం ఎంత ప్రయత్నించినా సరే ఒకే ఒక్క సరైన సినిమా పడితే చాలు కెరియర్ సెట్ అయినట్టే. ప్రస్తుతం అలాంటి కెరియర్ సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టి. అప్పుడెప్పుడో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో విజయ్ దేవరకొండతో కన్నా ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉన నవీన్ పొలిశెట్టి మధ్యలో బాలీవుడ్ వెళ్లి అక్కడ యూట్యూబ్ లో సందడి చేసి అక్కడ సినిమాల్లో ఛాన్స్ అందుకున్నాడు. ఇక తెలుగులో హీరోగా శ్రీనివాస్ ఆత్రేయ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నవీన్ పొలిశెట్టి ఆ నెక్స్ట్ సినిమా జాతిరత్నాలుతో మరో బ్లాక్ బస్టర్ కొట్టాడు.
రెండు వెంట వెంట సూపర్ హిట్లు కొడితే కుర్ర హీరో అయినా డిమాండ్ పెరుగుతుంది. ఈ క్రమంలో నవీన్ పొలిశెట్టికి సూపర్ డిమాండ్ ఏర్పడింది. అంతేకాదు తనతో సినిమా చేయాలనుకునే వారికి రెమ్యునరేషన్ కూడా బాగా అడుగుతున్నట్టు టాక్. ప్రస్తుతం యువి క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పొలిశెట్టి హీరోగా ఓ సినిమా వస్తుంద్ది. ఈ సినిమాను మహేష్ డైరెక్ట్ చేస్తుండగా స్వీటీ అనుష్క హీరోయిన్ గా నటిస్తుంది. నవీన్ పొలిశెట్టి 3వ సినిమాకే అనుష్కతో జోడీ కడుతున్నాడు.
ఇదిలాఉంటే ఈ సినిమాకు అతని రెమ్యునరేషన్ కూడా కోట్లల్లో ఉందని టాక్. తెలుస్తున్న సమాచారం ప్రకారం యువి క్రియేషన్స్ వారు నవీన్ పొలిశెట్టికి 4 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇస్తున్నారట. శ్రీనివాస్ ఆత్రేయ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాల టైం లో 40 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న ఈ యువ హీరో ఇప్పుడు 4 కోట్లు రెమ్యునరేషన్ అడగడం సర్ ప్రైజ్ చేస్తుంది. ఇక చేస్తున్న సినిమాల్లో మరో రెండు హిట్లు పడితే నవీన్ పొలిశెట్టి కూడా స్టార్ హీరో కేటగిరిలో చేరి 10 కోట్లు డిమాండ్ చేసినా చేస్తాడని అంటున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: