బాలీవుడ్ హ్యాండ్సమ్
హీరో హృతిక్ రోషన్ కి
బాలీవుడ్ లోనే కాదు ఇటు
టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉంది. ఈ
హీరో మూవీ ఇంకా పర్సనల్ లైఫ్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. హృతిక్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదండోయ్. కాగా తాజాగా తన మాజీ
భార్య సోషల్
మీడియా పోస్ట్ కు హృతిక్ స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. సుసానే ఖాన్
ఇంస్టాగ్రామ్ లో క్రిస్మస్ పండుగ సందర్భంగా
క్రిస్మస్ ట్రీ ని సుసానే ఖాన్ గ్రాండ్ గా అలంకరించి ఆ అలంకరణకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను
ఇన్స్టా లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలను షేర్ చేస్తూ క్యాప్షన్ ఇచ్చి తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.
ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు సైతం ఈ వీడియో పట్ల స్పందిస్తుండగా..
హృతిక్ రోషన్ సైతం స్పందించడం ఇపుడు వైరల్ గా మారింది. ఈ వీడియోపై హృతిక్ స్పందిస్తూ.. వావ్ సుసానే అలంకరణ చాలా అందంగానూ, అద్భుతంగానూ ఉంది అంటూ కామెంట్ చేశారు. దాంతో ఈ పోస్ట్ మరింత వైరల్ గా మారింది. బాలీవుడ్ బ్యూటీ
మలైకా అరోరా , బిపాసా బాసు,
రోహిత్ రాయ్ తదితరులు కూడా ఈ వీడియోపై స్పందించి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. హృతిక్ 2000 వ సంవత్సరంలో తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెప్పి సుసానే ఖాన్ ను 2000
డిసెంబర్ 20న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
కాగా 2013 లో వ్యక్తిగత కారణాల వలన పరస్పర అంగీకారంతో వీరు విడిపోయారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తన పోస్ట్ కు రిప్లై ఇవ్వడం ద్వారా మళ్లీ వీరిద్దరూ ఒక్కటి కానున్నారా అనే అంశం తెరపైకి వచ్చింది. అయితే ఇది దాదాపు అసాధ్యమే అని బీ టౌన్ లో చాలామందికి తెలిసినా ఎందుకో వీరిద్దరూ కలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. మరి ఏమి జరగనుంది అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.