మాస్ మహారాజా రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన క్రాక్ సినిమాతో బాక్సాఫీసు దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు, క్రాక్ సినిమాకు ముందు వరుస పరాజయాలతో డీలా పడిపోయి ఉన్న రవితేజ కు 'క్రాక్' సినిమా విజయం ఎక్కడ లేని ఉత్సాహాన్ని, ఆనందాన్ని తీసుకువచ్చింది. అయితే క్రాక్ సినిమా ఇచ్చిన జోష్ ను అలాగే కంటిన్యూ చెయ్యాలనే ఉద్దేశంతో రవితేజ వరుస క్రేజీ సినిమాలను లైన్ లో పెడుతూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఇందులో భాగంగా రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖిలడి సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమా ఫిబ్రవరి 11వ తేదీన విడుదల కాబోతుంది, ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు, ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు అమాంతం పెంచేశాయి.
ఈ సినిమాతో పాటు రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలతో పాటు రవితేజ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధమాకా సినిమాలో కూడా నటిస్తున్నాడు, ఈ సినిమాను దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెకిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూడు సినిమాలు సెట్స్ పై ఉండగానే సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర మరియు టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలో నటించడానికి కూడా రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, ఇలా క్రాక్ సినిమా విజయంతో వరుస సినిమాలను లైన్ లో పెడుతూ రవితేజ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ మీద ఉన్నాడు.