కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య ప్రధాన పాత్రలలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం బంగార్రాజు అని అందరికి తెలుసు.ఇందులో నాగార్జున సరసన రమ్యకృష్ణ అలాగే నాగచైతన్యకు జోడిగా కృతి శెట్టి నటిస్తున్నారు.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తైందని సమాచారం.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయట.. గతంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సిక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.. ఈ చిత్రానికి కూడా కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుందట..
ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నూతన సంవత్సరం రోజున ఉదయం 11 గంటల 22 నిమిషాలకు బంగార్రాజు టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిందట చిత్రయూనిట్. ఈ సందర్భంగా విడుదలచేసిన పోస్టర్లో తండ్రీ కొడుకులు - నాగార్జున మరియు నాగ చైతన్య మీసాలు తిప్పుతూ హ్యాపీ మూడ్‌లో కనిపిస్తున్నారట.. నాగార్జున పంచెకట్టులోను నాగచైతన్య స్టైలీష్ లుక్‌లో కనిపిస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ 2022లో ప్రేక్షకుల ముందుకు రానుందని అందరికి తెలిసిందే.
అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో వచ్చిన పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ వాసివాడి తస్సాదియ్య అనే పాటకు అద్భుతమైన స్పందన లభించింది.. నాగార్జున మరియు నాగ చైతన్య కలిసి ఇందులు స్టెప్పులు వేయగా ఫరియా అబ్దుల్లా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారట. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారని సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారని తెలుస్తుంది.నాగచైతన్య నాగార్జున కలిసి నటిస్తున్న రెండవ సినిమా ఎలా ఉండబోతుందా అని అభిమానులలో ఎంతో ఆసక్తి నెలకొందని సమాచారం. మరి చూడాలి బంగార్రాజు ఏ విధముగా మెప్పిస్తాడో...!