
పుష్ప రాజ్ డిలేటెడ్ సీన్ : అనవవసరం అంటున్న నెటిజన్స్..
ఇక మొదటి భాగంలో ఒక సీన్ బాగానే ఉన్నప్పటికీ అనవసరమని ఆ సన్నివేశాన్ని తీసేయడం జరిగింది. గొడ్డు మాట వినదు ఇంకా కొడుకు మాట వినడు అనే డైలాగ్ ఆధారంగా ఆ సీన్ న్ని హైలైట్ చేసినట్లు కనిపిస్తోంది.ఇక తీసుకున్న వ్యక్తి పరువు పోయేలా అప్పుని అడగడంతో గొడ్డును అమ్మేస పుష్పరాజ్ ఆ అప్పు తీర్చేస్తాడు. ఇక ఆ తర్వాత అతనికి వడ్డీతో సహా అన్ని డబ్బులు ఇచ్చినప్పటికీ పరువు కూడా మళ్ళీ తిరిగి రావాలని అంటాడు. అందరి ముందు నా పరువుని తీశారు కాబట్టి ప్రతి ఒక్కరికీ మేము మళ్ళీ నీకు డబ్బులు ఇచ్చినట్లుగా చెప్పాలి అని అతన్ని కొట్టుకుంటూ ప్రతీ ఇంటికి కూడా తీసుకు వెళతాడు. ఇక ఈ సీన్ అయితే ఒక విధంగా బాగానే ఉన్నప్పటికీ సినిమాకు అవసరం లేదు అని చెప్పాలి.నెటిజన్స్ కూడా ఈ సీన్ చూసి అనవసరం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఇప్పటికే మూడు గంటల వరకు సినిమా చాలా ఎక్కువ నిడివిలో ఉంది అనే విమర్శలు కూడా ఆడియన్స్ నుంచి చాలా వచ్చాయి. కానీ దర్శకుడు సుకుమార్ ఆ సమయంలో కూడా సినిమాను ఇంకా తాను అనుకున్నంతగా ప్రజెంట్ చేయలేకపోయాడు.