ప్రశ్నించిన వారినే తిరిగి ప్రశ్నించిన చరణ్..ఈ మెగా హీరో అస్సలు తగ్గడే..!!

VUYYURU SUBHASH
ఈ మధ్య కాలంలో మనం గమనించిన్నట్లైతే ప్రతి హీరో కూడా భారీగా వాళ్ల పారితోషకానీ పెంచేస్తున్నారు. 20 %,30% కాదు..ఏకంగా ఢబుల్ చేస్తున్నారు. ఈ లిస్ట్ లో స్టార్ హీరోలు కూడా ఉండ డం గమనార్హం. ఇప్పటికే బహుబలి తో తిరుగులేని విజయం అందుకున్న హీరో ప్రభాస్ ప్రతి సినిమాకి వంద కోట్లు తీసుకుంటున్నాడు అంటున్న క్రమంలోనే రీసెంట్ గా వస్తున్న స్పిరిట్ సినిమాకి 150 కోట్లు పారితోషకాని ఛార్జ్ చేస్తున్నాడంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి, ఇక ఈ క్రమంలోనే మరో స్టార్ హీరో కూడా ఆ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడంటూ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.

 మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా ఆయన పారితోషకానీ భారీ  గా పెంచిన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు  మారు మ్రోగిపోతున్నాయి. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న చరణ్ తన తరువాతి సినిమా శంకర్ తో చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్దాయిలో తెరకెక్కనుంది. ఈ సినిమాకి రాం చరణ్ తన కెరీర్ లోనే ఎప్పుడు లేని విధంగా  ఏకంగా 100 కోట్లను రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నాడంటూ నెట్టింట వార్తలు తెగ వైరల్ గా మారాయి. దీంతో ఫ్యాన్స్ సైతం షాక్ అయ్యారు.

ఇక రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ లో పాల్గోన్న చరణ్ ని ఓ విలేఖరి ఇదే విషయాని ప్రశ్నించగా..దానీ సమాధానమిస్తూనే..తిరిగి మళ్లీ ప్రశ్నించాడు ఈ మెగా వారసుడు. దీంతో ఈ విషయం ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్  గా మారింది.  రాం చరణ్ మాట్లాడుతూ.."అసలు వంద కోట్లు ఎక్కడ ఉన్నాయి? ఉన్నా కూడా నాకు ఎవరు ఇస్తారు చెప్పండి? అంటూ అని తిరిగి ప్రశ్నించారు. 100 కోట్ల రెమ్యూనరేషన్ న్యూస్ ఫేక్ అంటూ అవన్నీ వట్టి పుకార్లేనని తేల్చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: