అర్జున ఫల్గుణ: హీరో శ్రీ విష్ణు పప్పులో కాలేశాడే?
ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు వరకు అప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్, ట్రైలర్ మరియు పాటలు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. అందుకే ఈ సినిమా హిట్ అవుతుందని అంతా ఆశించారు. కానీ రివ్యూ ప్రకారం చూస్తే ట్రైలర్ లో చూపించినంత స్టఫ్ మరియు టైటిల్ లో ఉన్న పవర్ కథలో లేదని తెలుస్తోంది. దర్శకుడు తేజకు ఇది రెండవ సినిమా కావడంతో కొంతమేర కన్ఫ్యూజ్ అయినట్లు తెలుస్తోంది. సాధారణమైన కథనే అటూ ఇటు తిప్పి లాగించేశాడు. దీనితో కథలో దమ్ము లేక ప్రేక్షకులు నిరాశగా వెనుతిరిగారు. అర్జున ఫల్గుణ అంటూ వచ్చిన శ్రీ విష్ణుకి ప్లాప్ తప్పేలా లేదు.
ఈ సినిమాకు రివ్యూ ఇచ్చిన వారు ఎందుకో శ్రీ విష్ణు ఈ సారి పప్పులో కాలేశాడే అని అంటున్నారు. కాగా శ్రీ విష్ణు ఫ్యాన్స్ మాత్రం యావరేజ్ మూవీ అంటున్నారు. మరి నూతన సంవత్సరం కానుకగా విడుదలైన ఈ సినిమా ఒక మోస్తరు కలెక్షన్ లను అయినా అందుకుంటుందా అన్నది అనుమానమే. ఎందుకంటే ఇప్పటికే "శ్యామ్ సింగరాయ్" మరియు పుష్ప సినిమాలు మంచి కలెక్షన్ లతో ఆడుతున్నాయి.