ప్రభాస్ మంచి తనానికి ఇదే నిదర్శనం..

Purushottham Vinay
పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా రాధే శ్యామ్. జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ వద్ద భారీ ఎత్తున నిర్వహించిన సంగతి అందరికి తెల్సిందే.రెబల్ స్టార్ ప్రభాస్ ఇంకా అలాగే పలువురు ప్రముఖులు ఆ ఈవెంట్ కు హాజరు అయ్యారు.ఇక రెబల్ స్టార్ అభిమానులు కూడా చాలా పెద్ద ఎత్తున హాజరు అయ్యారు. దేశ వ్యాప్తంగా ఆసక్తి ఉన్న రాధేశ్యామ్ ఈవెంట్ పెద్ద సూపర్ హిట్ అయ్యింది.అయితే ఆ ఈవెంట్ టైంలో కృష్టం రాజు హోర్డింగ్ ఒకటి విరిగి పడి అప్పుడు ముగ్గురికి గాయాలు అయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉంది. గాయపడ్డ ముగ్గురికి పూర్తి ఆసుపత్రి ఖర్చులను రెబల్ స్టార్ ప్రభాస్ చెల్లించాడు.


ఇక అంతే కాకుండా వారికి ఆర్థిక సాయం కూడా చేసేందుకు ముందుకు వచ్చినట్లుగా యూవీ క్రియేషన్స్ సంస్థ వర్గాల నుండి సమాచారం అందుతోంది.ఇక ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో ప్రభాస్ అభిమానులు మరోసారి మా ప్రభాస్ మనసున్న నిజమైన మారాజు అంటూ తెగ సంబరపడుతున్నారు. ఆయన సినిమా ల లాగానే ఆయన మనసు కూడా చాలా భారీగా ఉందంటూ పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. మంచి మనసున్న ప్రభాస్ ను ఇండస్ట్రీ వర్గాల వారు ఇంకా అలాగే నెటిజన్స్ కూడా ఎంతగానో అభినందిస్తున్నారు.ఇక మన రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా ల విషయానికి వస్తే రాధే శ్యామ్ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఇంకా బాలీవుడ్ డైరెక్టర్ తో చేస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయ్యింది.. ఇక సలార్ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం వరకు జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రాజెక్ట్ కే కూడా ఇటీవలే మొదటి షెడ్యూల్ ను ముగించారు. ఇక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమాను వచ్చే సంవత్సరం ద్వితీయార్థంలో పట్టాలెక్కించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: