ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ లో సమాధానం లేని ప్రశ్నలు !
ఇన్ని అయోమయ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ ‘ఆర్ ఆర్ ఆర్’ అనుకున్న డేట్ కు ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని చెపుతున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ వ్యవహారం తీసుకుంటే ఈ మూవీని 150 కోట్లకు ఆంధ్రా సీడెడ్ జిల్లాలలో ఆమ్మకం జరిగింది అని చెపుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రాలో కొనసాగుతున్న పరిస్థితులలో ఈమూవీని రిలీజ్ చేస్తే నష్టాలు తప్ప లాభాలు ఉండవు.
ఒక్క తెలంగాణ పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ ఇన్ని వందల కోట్ల రికవరీ ఒక్క ఆంధ్రా ప్రాంతం నుండి ఎలా జరుగుతుంది అన్న సందేహాలు చాలామందికి వస్తున్నాయి. ఈ పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల కావడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈమూవీ ఎట్టి పరిస్థితులలోను వాయిదా పడదు అంటూ బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్ష్ చేసిన ట్విట్ తో ఈమూవీ విడుదల ఖాయం అయిపోయింది.
తెలుగు రాష్ట్రాలలో ఈమూవీకి పోటీగా మరొక సినిమా విడుదల అయ్యే అవకాశం లేకపోవడంతో పాటు ‘రాథే శ్యామ్’ కూడ వాయిదా పడుతుంది అని వస్తున్న వార్తల మధ్య ‘ఆర్ ఆర్ ఆర్’ ఏకాఛత్రాధిపత్యం కొనసాగుతుంది అన్న అంచనాలతో ‘ఆర్ ఆర్ ఆర్’ ముందుకు వస్తోంది అనుకోవాలి. అయితే ఇప్పటికే దేశంలో ఒమైక్రాన్ కేసుల సంఖ్య అధికారికంగా 1000 దాటిపోవడంతో ఏరోజున ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితిగా మారింది. ఇన్ని అయోమయాల మధ్య రాజమౌళి ఏఅంచనాలతో ‘ఆర్ ఆర్ ఆర్’ ను కేవలం ఓవర్సీస్ ప్రీమియర్ షోల కలక్షన్స్ ను నమ్ముకుని విడుదల చేస్తున్నాడో సమాధానం లేని ప్రశ్నగా మారింది..