షాక్:ఫస్ట్ టైమ్ జగన్ ప్రభుత్వాన్ని తప్పుబట్టిన ఆర్జివి..!

Divya
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే..RGV అని టక్కన చెబుతూ ఉంటారు. అయితే ఈ డైరెక్టర్.. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, జగన్ సర్కార్ మీద ఎటువంటి మాటలు కూడా మాట్లాడేవారు కాదు. అయితే మొదటిసారిగా ఏపీ ప్రభుత్వం పై తప్పుని ఎత్తి చూపిస్తున్నారు వర్మ. ఇక అలాగే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు కూడా అతను చేసిన కొన్ని తప్పులను కూడా చూపించడం జరిగింది. అయితే జగన్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి మూడు సంవత్సరాలు కావస్తున్నా వారి మీద ఒక తప్పును కూడా ఎత్తి చూపలేదు వర్మ. కానీ ప్రస్తుతం సినిమా టికెట్ల విషయంపై తను మాట్లాడవలసి వచ్చింది అని తెలియజేశాడు వర్మ.
ఈ విషయంపై ఎంతమంది హీరోలు కూడా స్పందించడం జరిగింది. కానీ వారి మీద కొంత మంది నేతలు విరుచుకు పడడం జరిగింది. అయితే తాజాగా టిక్కెట్ల ధరల పై తీసుకున్న నిర్ణయాన్ని.. వర్మ తప్పు గా తేల్చేశారు. టికెట్లు ధర తగ్గించడం అనేది నా దృష్టిలో అయితే ఖచ్చితంగా తప్పే అని తెలియజేశారు. అందుకు పూర్తిగా వివరించడం కూడా జరిగింది.."ఉత్పత్తిదారులకు ధరను నిర్ణయించుకోవచ్చు.. అయితే వాటిని కొనాలా వద్దా అనే విషయం మాత్రం కేవలం వినియోగదారుడిదే అని తెలియజేశారు.
టికెట్ ధర ఎంత ఉన్నప్పటికీ కూడా సినిమా నచ్చితేనే చూస్తారని.. నచ్చని వారు చూడరని తెలియజేశారు. ఇక ఇదే సందర్భంలో ఒక పోలికను  కూడా పోల్చడం జరిగింది. సాధారణంగా దొరికే కారు ధరలకే.. పెద్దపెద్ద బెంజ్ కార్లు కావాలంటే ఎలా? టిక్కెట్లు ధరలు కూడా తగ్గించడంతో సినీ ఇండస్ట్రీలో ఉండే వారి మీద కక్ష తీర్చుకోవడానికో లేదో నాకు తెలియదు అంటూ తెలియజేశారు. ఇలా చేయడం వల్ల హీరోలకు ఎలాంటి నష్టం ఉండదని.. కేవలం నిర్మాతలకే అని తెలియజేశారు. కానీ అగ్ర హీరోలకు ఎలాగైనా డబ్బులు వస్తాయని తెలియజేశారు. వారి రెమ్యూనరేషన్ ను తగ్గించుకోవడం అసాధ్యమని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: