నాచురల్ స్టార్
నాని హీరోగా
సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సబాస్టియన్
హీరోయిన్ లుగా
రాహుల్ సాంకృత్యయన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా
శ్యామ్ సింగరాయ్, ఈ
సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాల ద్వారా మొదటి నుండి ఈ
మూవీ పై జనాలలో మంచి అంచనాలు నెలకొన్నాయి, ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగివున్న ఈ
సినిమా ఈ మధ్యే
క్రిస్మస్ సందర్భంగా
డిసెంబర్ 24 వ తేదీన
థియేటర్ లలో విడుదల అయింది, ఈ
సినిమా తెలుగుతో పాటు కన్నడ, మలయాళ,
తమిళ భాషల్లో కూడా ఒకే రోజు విడుదల అయ్యింది. విడుదలైన మొదటి షో నుండే ఈ
సినిమా మంచి టాక్ తో ముందుకు దూసుకు పోతుంది, ఈ సినిమాలో నాచురల్ స్టార్
నాని అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు, అదే రేంజ్ లో
సాయి పల్లవి కూడా తన నటనతో ప్రేక్షకులను అలరించింది, ఈ సినిమాలో దేవదాసి పాత్రలో కనిపించిన
సాయి పల్లవి తన నటనతో ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కించుకుంది.
వీరిద్దరితో పాటు కృతి శెట్టి కూడా తన అదిరిపోయే మోడ్రన్ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ
సినిమా ఇండియా లో మాత్రమే కాకుండా అమెరికాలో కూడా అదిరిపోయే కలెక్షన్ లను రాబడుతోంది, రెండవ వారంలో
శ్యామ్ సింగరాయ్ సినిమాకు 20 పైగా కొత్త
థియేటర్ లను జోడించనున్నామని
అమెరికా పంపిణీ వర్గాలు ప్రకటించాయి, యుఎస్ఏ లో ఇప్పటికే దాదాపు 200 ప్లస్
థియేటర్ లలో (అద్భుతమైన హోల్డోవర్లు) లో
శ్యామ్ సింగరాయ్ సినిమా ఆడుతుంది. ఈ సినిమాకు ఇకపై అదనంగా
థియేటర్ లను పెంచనున్నారు, ఇప్పటికే ఆరు వందల డాలర్ల వసూళ్లను సాధించిన ఈ
సినిమా మిలియన్ డాలర్ల వైపు పరుగులు పెడుతోంది, ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు.