జై బాలయ్య పాటపై రవితేజ డాన్స్.. భలే చేసాడుగా?

praveen
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అసలు సిసలైన మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు నందమూరి బాలకృష్ణ. ఏ హీరో సినిమాలైన మాస్ ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో తెలియదు కానీ బాలయ్య సినిమా వచ్చిందంటే చాలు మాస్ ప్రేక్షకులందరికీ  కూడా పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇక సినిమాలో బాలకృష్ణ చెప్పే పంచ్ డైలాగులు అయితే అందరికీ ఉర్రూతలూగిస్తున్నాయి. బాలకృష్ణ సినిమా విడుదలైనప్పుడు థియేటర్ మొత్తం ఈలలు, గోలలతో  నిండి పోతూ ఉంటుంది. ఇకపోతే ఇటీవలే బాలకృష్ణ అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించారు.


 తన హిట్ దర్శకుడైన బోయపాటి శీను తో కలిసి మరో సూపర్ హిట్ అందుకున్నాడు బాలకృష్ణ. ఈ సినిమాలో జై బాలయ్య పాట ఎంతగానో ఫేమస్ అయ్యింది. ఇక ఈ పాటపై బాలకృష్ణ చేసిన డ్యాన్స్ అయితే అదిరిపోయింది అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు తెలుగు ఓటిటి ఆహా వేదికగా 'unstoppable' అనే కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎపిసోడ్ లో కొత్తగా గెస్ట్ ను పిలిచి ఆసక్తికర ప్రశ్నలు అడుగుతూ అందరికీ ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉన్నారు. ఓటిటి ప్రేక్షకులకు కూడా ఎంతగానో దగ్గరయ్యారు బాలకృష్ణ. తన వాక్చాతుర్యంతో అదరగొడుతున్నారు.



 అయితే ఇటీవలే బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'unstoppable' కార్యక్రమంలో భాగంగా హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని స్పెషల్ గెస్ట్ లుగా వచ్చారు. ఇప్పటికే ఎపిసోడ్ కు సంబంధించి విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది  ఇక ఇటీవల దీనికి సంబంధించి మరో ప్రోమో కూడా విడుదల చేశారు. గతంలో విడుదలైన ప్రోమోలో దర్శకుడు గోపీచంద్ మలినేని జై బాలయ్య పాటపై బాలకృష్ణ చేసిన డాన్స్ చేసి అలరించారు.ఇటీవల విడుదలైన ప్రోమోలో మాస్ మహారాజా రవితేజ జై బాలయ్య పాటపై డాన్స్ చేశారు  అయితే బాలకృష్ణ లాగా కాకుండా తనదైన శైలిలో చేసి ప్రేక్షకులను అలరించారు రవితేజ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: