ఇక ఈమధ్య కాలంలో తెలుగు నుంచి బాగా క్రేజ్ అందుకున్న సింగర్స్ లలో
మంగ్లీ టాప్ లిస్టులో కొనసాగుతొందనే చెప్పాలి.
మంగ్లీ గత కొంత కాలంగా ఎలాంటి పాట పాడినా కూడా అది బాగా హిట్టయ్యి నెట్టింటి తెగ వైరల్ గా మారుతోంది.ఇక అలాగే ఆమె పాడే పాటలు కొన్నిసార్లు వివాదాలకు కూడా దారి తీస్తున్నాయి.ఫస్ట్ తీన్ మార్ వార్తలతో మంచి గుర్తింపు అందుకున్న
మంగ్లీ ఆ తరువాత మెల్లగా ప్రయివేట్ సాంగ్స్ పాడుతూ వాటి ద్వారా తన ఉనికిని చాటుకుంది.ఆమెలో మంచి సింగర్ ఉన్నట్లు గుర్తించిన యస్ యస్
థమన్ మొదట శైలజా
రెడ్డి అల్లుడు సినిమాకు పాట పాడించే అవకాశం ఇచ్చాడు. ఇక ఆ తరువాత
మంగ్లీ కెరీర్ పరంగా ఏ మాత్రం వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆమె ఎలాంటి పాట పాడినా కాని అది ప్రేక్షకులకు బాగా దగ్గరవుతోంది.
అందువల్ల ఆమెకు ఫ్యాన్ ఫాలోవర్స్ సంఖ్య కూడా గట్టిగానే పెరిగింది. గతంలో కంటే ఎక్కువగా జనాలు
మంగ్లీ వచ్చింది అంటే చాలు
ఈవెంట్స్ కు ఎగబడి వస్తున్నారు.ఇక ఈ మధ్య ఒక ప్రయివేట్ సాంగ్ కోసం షూట్ కి వెళ్లిన
మంగ్లీ అక్కడ అభిమానులపై ఒక్కసారిగా కోప్పడి చిర్రెత్తిపోయింది. తనలో ఎప్పుడు చూడని కోపాన్ని బయటపెట్టడంతో అక్కడ అందరూ షాక్ అయ్యారు. సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డ ఫ్యాన్స్ పై ఆగ్రహంతో ఫోన్లు పగల గొట్టండి అంటూ తిట్టేసింది. ఆఖరికి తన అసిస్టెంట్ పై కూడా
మంగ్లీ కోప్పడింది.వెంటనే బండికి
ఫోన్ చేయ్
రా దరిద్రుడా అంటూ
మంగ్లీ కొట్టినట్లు కూడా కనిపిస్తోంది. ఏదేమైనా కూడా
మంగ్లీ ఒక్కసారిగా తన సహానాన్ని కోల్పోయి ఇలా చిర్రెత్తిపోవడం పై సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.. నువ్వేమైన ఇంటర్నేషనల్ సింగర్ అనుకుంటున్నావా
మంగ్లీ ఆఫ్ట్రాల్ ఒక
లోకల్ సింగర్ వి. అంత పనికిరాదు. ఇవే తగ్గించుకుంటే చాలా మంచిదని కామెంట్స్ చేస్తున్నారు.