షాక్: ఎన్టీఆర్ కి నచ్చినవి ఇవేనట..!

Divya
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 30 వ సినిమాకు అతి దగ్గరలో చేరువయ్యారు అని చెప్పవచ్చు. తన కెరీర్ ను బాలరామాయణం తో మొదలు పెట్టి.. కేవలం అతి చిన్న వయసులోనే హీరోగా మారిపోయాడు. మొదటిసారిగా నిన్ను చూడాలని సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ తో మంచి సక్సెస్ ను అందుకున్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత ఆది మూవీ తో మాస్ హీరోగా.. మాస్ ప్రేక్షకులను అలరించారు. ఇక అంతే కాకుండా 18 సంవత్సరాల అయితే స్టార్ హీరోగా ఎదిగి పోయాడు.

ఇక ఆ తర్వాత వచ్చిన సింహాద్రి మూవీ తో ఓవర్ నైట్ కి నెంబర్ వన్ పొజిషన్ లో నిలబడ్డాడు హీరో ఎన్టీఆర్.. ఎన్టీఆర్ నటించిన ప్రతి సినిమాకు తన బాడీ లాంగ్వేజ్ ను,  తన స్టైల్ ను మారుస్తూనే ఉంటాడు. ఎన్టీఆర్ స్టోరీల ఎంపిక మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డా.. ఇప్పుడు మాత్రం అంతా పర్ఫెక్ట్ గానే చూసుకుంటున్నాడు. ఇప్పటివరకు యువ హీరోలలో..ఏ హీరో చేయని ప్రయోగం జై లవకుశ సినిమాలో చేసి ఆశ్చర్య పరిచేలా చేశాడు. ఇక రాజమౌళి తో చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ తో హిట్ కొట్టి.. రాజమౌళి కి లక్కీ హీరో గా మారిపోయారు. ఎన్టీఆర్ RRR ప్రమోషన్లలో తనకు ఇష్టమైన సినిమాల గురించి తెలియజేశారు.

అందులో మొదటి వరుసలో జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన జై లవకుశ, అదుర్స్, టెంపర్ సినిమా లు బాగా నచ్చాయని తెలియజేశాడు ఎన్టీఆర్. ఇక అదుర్స్ లో తనకి కామెడీ, ద్విపాత్రాభినయం చాలా బాగా నచ్చింది అని తెలియజేశాడు. ఇక టెంపర్ మూవీలో అయితే ఎన్టీఆర్ రాష్ పర్ఫార్మెన్స్ చేశారని చెప్పవచ్చు. ఇక జై లవకుశ లో ఉండే క్యారెక్టర్ల కూడా తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: