కావాలని అడిగితే చూపిస్తానంటున్న ఉప్పెన బ్యూటీ..!

NAGARJUNA NAKKA
సాధారణంగా హీరోయిన్స్‌కి స్టార్డమ్ వచ్చాక బోల్డ్ సీన్స్‌కి దూరంగా ఉంటారు. ఇమేజ్‌కి తగ్గ క్యారెక్టర్స్‌కే సైన్ చేస్తుంటారు. అయితే కృతి శెట్టి మాత్రం ఈ రూల్స్‌ని బ్రేక్ చేస్తోంది. డెబ్యూ మూవీతోనే సూపర్ స్టార్డమ్‌ తెచ్చుకున్న బేబమ్మ, బోల్డ్‌ సీన్స్‌ చెసేందుకు కూడా ఓకే అంటోంది. సీన్‌ డిమాండ్‌ చేస్తే రూల్స్‌ బ్రేక్ చేస్తానని చెప్తోంది కృతి. ఇంకేముంది ఆమె అభిమానులు, ప్రేక్షకులు షాక్ లో ఉన్నారు.
కృతిశెట్టి 'ఉప్పెన' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి జంటగా నటించిన ఈ సినిమా 70 కోట్ల వరకు వసూల్‌ చేసింది. ఇక ఈ మూవీలో బేబమ్మగా నటించిన కృతికి సూపర్‌ ఫాలోయింగ్ వచ్చింది. ఈ క్రేజ్‌తోనే కృతిశెట్టికి వరుస అవకాశాలు వచ్చాయి.
కృతిశెట్టి రీసెంట్‌గానే 'శ్యామ్‌ సింగరాయ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీలో కృతి కొంచెం బోల్డ్‌ క్యారెక్టర్ ప్లే చేసింది. అల్ట్రామోడ్రన్‌ గర్ల్‌ పాత్రతో ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేసింది. స్మోకింగ్ ఆల్కహాల్‌ సీన్స్‌లో కృతి పెర్ఫామెన్స్ చూసి ఆడియన్స్‌ కూడా ఆశ్చర్యపోయారు. ఈ సీన్స్‌ గురించి మాట్లాడుతూ, సీన్ డిమాండ్‌ చేస్తే బోల్డ్‌గా చెయ్యడానికి కూడా అభ్యంతరం లేదని చెప్పింది కృతి.
సినిమాలో ఏం చేసినా యాక్టింగ్‌లో భాగమే. ఎమోషనల్‌ సీన్స్‌ అయినా, రోమాంటిక్‌ సీన్స్‌ అయినా ఏదైనా అన్నీ నటనే అని చెప్పింది కృతి. ఇక ఫస్ట్‌ మూవీ 'ఉప్పెన'లో కూడా కృతి శెట్టి ఒక రొమాంటిక్‌ సాంగ్ చేసింది. జల జలపాతం పాటతో థియేటర్స్‌ని హీటెక్కించింది. మరి కొంచెం బోల్డ్ అండ్‌ రొమాంటిక్ క్యారెక్టర్స్‌ చేస్తోన్న కృతికి ఫ్యూచర్‌లో ఎలాంటి ఇమేజ్ వస్తుందో చూడాలి.

మొత్తానికి కృతి శెట్టి కామెంట్స్ టాలీవుడ్ ప్రేక్షకులను షాక్ కు గురిచేసింది. ఎందుకు ఆమె ఇలాంటి ఆలోచనతో ఉందని చర్చించుకుంటున్నారు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఇలాంటి సీన్లకు కూడా ఒప్పుకుంటుందా అని ఆశ్చర్యపోతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: