సమంత గురించి మూడు ముక్కల్లో చెప్పేసిన రామ్ చరణ్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ సమంత, అక్కినేని నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు సమంత అందచందాలకు,  నటనకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు దక్కాయి, ఇలా మొదటి సినిమాలోనే తన అందంతో, నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ హాట్ బ్యూటీ కి టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించిన సమంత అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది, ఇలా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయం లోనే సమంత,  నాగ చైతన్య ప్రేమించి పెళ్ళాడింది,  అయితే కొద్ది కాలం క్రితమే వీరిద్దరూ విడాకులు తీసుకుని దూరమయ్యారు.


 అయితే విడాకుల తర్వాత సమంత తన సినిమాల స్పీడ్ పెంచేసింది,  ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేస్తూనే కొత్త సినిమాలను ఓకే చేసుకుంటూ ముందుకు వెళుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు,  రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, డైరెక్టర్‌ రాజమౌళి ల భారీ మల్టీ స్టారర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్‌ కోసం మీడియా సంస్థలకు వరుస బెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ఈ క్రమంలో సమంత గురించి చెప్పమని యాంకర్‌ రామ్‌ చరణ్‌ ను ప్రశ్నించాడు. దానితో సమంత కమ్ బ్యాక్‌.. బిగ్గర్‌.. స్ట్రాంగర్‌..' అంటు మూడు ముక్కల్లో రామ్ చరణ్ సమాధానాన్ని చెప్పేశాడు. ఇది ఇలా ఉంటే సమంత బాలీవుడ్ లో మరో వెబ్ సిరీస్ లో నటించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: