యాడ్ లు చేసి విమర్శలు పాలైన 2 హీరోయిన్ లు వీరే?

frame యాడ్ లు చేసి విమర్శలు పాలైన 2 హీరోయిన్ లు వీరే?

VAMSI
సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలు, హీరోయిన్లు, అలాగే క్రేజ్ పెంచుకున్న క్రికెటర్లు సైతం ఈ మధ్య కాలంలో ఎక్కువగా పలు వాణిజ్య ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. తద్వారా ఆ వ్యాపారాలకు మంచి ప్రమోషన్ మరియు ఫాలోయింగ్ పెరుగుతుంది. అలాగే మన సెలబ్రిటీలకు సైతం లాభదాయకం. సీనియర్ హీరో, యంగ్ హీరోయిన్ అని తేడా లేకుండా పాపులర్ అయిన సెలబ్రిటీలు అందరూ పలు రకాల యాడ్స్ తో దర్శనమిస్తున్నారు. అయితే ఈ క్రమంలో కొందరు సెలబ్రిటీలు వీరు చేసే ప్రకటనల కారణంగా విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. వారెవరు...ఏ యాడ్స్ అనేది ఒక సారి చూద్దాం.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ స్టార్ హీరోయిన్ల లో కన్నడ భామ రష్మిక మందన్న ఒకరు. కాగా
ఇటీవల ఒక యాడ్ కారణంగా ట్రోలింగ్ కు గురయ్యారు. అండర్వేర్ కంపెనీని ప్రమోట్ చేసే యాడ్ లో .. హీరో ఎక్సర్సైజ్ చేస్తుండగా అతడు అండర్వేర్ కాస్త కనిపిస్తుంది. ఇక అక్కడే ఉన్న రష్మిక అలాగే ఆ అండర్వేర్ వైపు చూస్తూ ఉండిపోతుంది. అలా ఆ యాడ్ ద్వారా ఆ బ్రాండ్ అండర్వేర్ ను ప్రమోట్ చేయాల్సి వచ్చింది. దాంతో మహిళల భావాలను కించపరిచేలా ఏమిటా యాడ్..అసలు ఆ యాడ్ ఎలా ఒప్పుకున్నారు? అంటూ డబ్బుల కోసం మరి ఇలాంటి యాడ్ లు కూడా చేస్తావా అంటూ రష్మికపై విమర్శల వర్షం కురిపించారు.

ఒకే ఇదే తరహాలో హీరోయిన్ రెజీనా కాసాండ్రా కూడా ఓ యాడ్ కారణంగా విమర్శల పాలయ్యారు. సిగ్నేచర్ అనే ఆల్కహాల్ బ్రాండ్ ను ప్రమోట్ చేసే యాడ్ లో నటించడానికి ఒప్పుకుని ఆ యాడ్ ను చేశారు. ఇంకేముంది ఒక సెలబ్రిటీ అయుండి ఇలాంటి యాడ్ లు చేయడం ఏమిటి..?? ఆల్కహాల్ ఆరోగ్యానికి ప్రమాదం అన్న విషయం తెలియదా..?? సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నా వ్ అంటూ నెటిజన్లు చేతిలో ట్రోలింగ్ కి గురయ్యారు రెజీనా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: