ఇంత మంచి ఆఫర్ ను రిజెక్ట్ చేయడానికి సమంతకు పిచ్చా..?
ఇక ఈ విషయాలను ఏం పట్టించుకోకుండా వాళ్లిద్దరూ వాళ్ల లైఫ్ వాళ్లు చూసుకుంటూ కెరీర్ ని టాప్ లో నిలబెట్టేందుకు ట్రై చేస్తున్నారు. విడాకుల తరువాత నాగచైతన్య సినీ కెరీర్ తో పోల్చితే సమంత టాప్ లో ఉందనే చెప్పాలి. విడాకుల తరువాత అమ్మడుకి దశ తిరిగిందేమో అన్నట్లు..వరుస బడా ఆఫర్లతో దూసుకుపోతుంది. తెలిసి చేస్తుందో లేక కోపంతో చేస్తుందో తెలియదు కానీ పెళ్లి తరువాత పద్ధతిగా కనిపించిన సమంత విడాకుల తరువాత హాట్ గా కనిపిస్తూ అక్కినేని అభిమానులకు కోఫం తెప్పిస్తుంది. కావాలనే చైతన్య ను బాధపెట్టడానికి ఇలా ఐటెం సాంగ్స్ చేస్తూ తన పరువు తీస్తుందని అంటున్నారు ఫ్యాన్స్.
కాగా , రీసెంట్ గా అమ్మడుకి మరో బంపర్ ఆఫర్ వచ్చిన్నట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే చేతిలో 4 బడా సినిమాలు పెట్టుకుని ఉన్న సమంతకు మరో అద్దిరిపోయే ఆఫర్ అందిన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న క్రేజీ కాంబినేషన్ అయిన కొరటాల శివ-తారక్ సినిమాలో హీరోయిన్ గా సమంతను ఫైనల్ చేసిన్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్30వ సినిమాగా రూపొందనున్న ఈ చిత్రంలో సమంత సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందట. వీరిద్దరు ఇదివరకే చాలా సినిమాలో కలిసి నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా హిట్ పెయిర్ గా కూడా పేరు తెచ్చుకున్నారు. దీంతో మరోసారి ఈ హిట్ కాంబినేషన్‌ను రిపీట్ చేయనున్నారట డైరెక్టర్ కొరటాల శివ. ఇక ఇలాంటి ఛాన్స్ వస్తే సమంత వదులుకొవడానికి పిచ్చిదా..ఖచ్చితంగా చేస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.