వాళ్ల నోళ్లు మూయించిన జెస్సి..

Purushottham Vinay
ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా మంచి గుర్తింపు అందుకున్న వారిలో జస్వంత్ జెస్సి కూడా టాప్ లిస్టులో ఉన్నాడని నిశ్శందేహంగా చెప్పవచ్చు. ఫ్యాషన్ ప్రపంచంలో ఓ ప్రొఫెషనల్ మోడల్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న జెస్సి చాలా తొందరగానే హౌస్ లో బాగానే సెట్టయ్యాడు.ముఖ్యంగా కోరియోగ్రాఫర్ అనీ మాస్టర్ తో గొడవ పడినప్పుడు అతను హౌస్ లో నుంచి వెళ్లిపోవడం కాయమని అతని తోటి హౌస్ మేట్స్ అనుకున్నారు.కాని జెస్సి వారి అంచనాలని తల కిందులు చేస్తూ జెస్సి బాగా ఆడి ఆడియన్స్ మెప్పు పొంది బిగ్ బాస్ సీజన్ 5లో టాప్ 5 వరకు వెళ్లాలని జెస్సి గట్టిగానే పోరాడాడు. అయితే కొన్ని అనారోగ్య కారణాల వలన జెస్సి 10వ వారంలో బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇక ఆ తరువాత మెల్లగా జెస్సి కెరీర్ ను సెట్ చేసుకునే ప్రయత్నాలు చేశాడు.ఇక బిగ్ బాస్ గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్ లో సినిమా సెట్ అయినట్లు కూడా జెస్సి తెలియజేశారు.దాంతో జెస్సిని తక్కువ అంచనా హోస్ మేట్స్ నోళ్లు మూయించి షాక్ ఇచ్చాడు.


ఇక సోషల్ మీడియాలో అతను అఫీషియల్ గా సినిమా పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ఆ సినిమాకు ఎర్రర్ 500 అనే టైటిల్ కూడా సెట్ చేశారు. ఇక సినిమా ఫస్ట్ లుక్ విషయానికి వస్తే ఆ పోస్టర్ లో జెస్సి రక్తపు మరకలతో తుపాకీ పట్టుకొని ఒక స్టిల్ ఇచ్చాడు. చూస్తుంటే జెస్సి మొదటి సినిమాతోనే మాంచి యాక్షన్ లుక్ లో దర్శనమివ్వనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.ఇక ఆ సినిమా పోస్టర్ ను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన జెస్సి ఈ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందని అలాగే మీ సపోర్ట్ కూడా నాకు కావాలి అని పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఫ్యూచర్ లో మరింతగా ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నం చేస్తానని కూడా జెస్సి తెలియజేశాడు. ఇక పది వారాల దాకా బిగ్ బాస్ హౌస్ లో కొనసాగిన జెస్సీ 15 లక్షల దాకా పారితోషికం అందుకున్నట్లు సమాచారం. ఈ ప్రస్తుతం అతను ఇండస్ట్రీ లో సినిమా అవకాశాలతో బాగా బిజీ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. మరి నటుడిగా జెస్సి ఏ స్థాయికి వెళతాడో చూడాలి.అయితే జెస్సి మాత్రం తన సక్సెస్ తో తనను తక్కువ అంచనా వేసిన నట్రాజ్, లహరి షరీ, మానస్, సన్నీ, రవి, హామీద లాంటోళ్ళ నోళ్లు గట్టిగా మూయించాడనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: