షాక్:సినిమా టికెట్లు విషయంపై..కామెంట్స్ చేసిన యంగ్ హీరో..?

Divya
ప్రస్తుతం కరొనా మరొకసారి తన ప్రభావం చూపించబోతోంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అంతే కాకుండా ఓమిక్రాన్ అనే వైరస్ కూడా ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఇక దీంతో ఈ సంక్రాంతికి కూడా ఈ ఏడాది ఎన్నో సినిమాలు విడుదల చేయడానికి కొంతమంది నిర్మాతలు రెడీ అయ్యారు. ఇక ఇదే తంతు లో ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల ధరల పై.. కొన్ని కండిషన్స్ పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు సినీ ఇండస్ట్రీలోని వారికి ఇబ్బందులు తలెత్తాయి. అయితే ఈ విషయంపై కొంతమంది సినీ ప్రముఖులు ఇండైరెక్టుగా అసంతృప్తిని తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా ప్రతి ఒక్కరు సినిమా థియేటర్లను పెంచాలి అన్నట్లుగా ఏపీ ప్రభుత్వాన్ని.. ఉద్దేశించి మాట్లాడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ విషయంపై హీరో నాని కూడా మాట్లాడడం జరిగింది. టికెట్టు ధరలు సినీ ప్రేక్షకులను అవమానించేలా ఉందని, అంతేకాకుండా కిరాణాకొట్టు తో పోల్చడం కూడా జరిగింది. ఇక ఇలా చేయడంతో ఈ వార్తలు పెద్ద ఎత్తున దుమారం రేపింది. అయితే ఇదే విషయంపై ఇప్పుడు తాజాగా మరో యువ హీరో నిఖిల్ కూడా  కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మిగతా సోషల్ మీడియా ద్వారా.. సినిమా అనేది ఒక రైలు ప్రయాణం లాంటిది.. థియేటర్లలో ఇప్పటికీ ఇంకా 20 రూపాయలకే పిక్చర్ దొరుకుతోంది.. కానీ రైలు ప్రయాణంలో స్థాయిని బట్టి టికెట్ రేటు కొనుక్కో వచ్చునని తెలియజేశారు.
ప్రస్తుతం టికెట్లు విషయంపై కూడా ఇలాంటి తంతే జరుగుతోందని తెలియజేశాడు నిఖిల్. థియేటర్లలోనే రేటు ఇంత తక్కువ చేయకుండా.. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోనే ఉంచే విధంగా చేయాలని  అభిప్రాయం వ్యక్తం చేశారు నిఖిల్.నాకు సినిమా థియేటర్ అంటే ఒక దేవాలయం అని తెలియజేశారు. థియేటర్లలో సినిమాని సామాన్య ప్రజలు ఎలా చేస్తారో.. నేను కూడా అలాగే థియేటర్ లో ఎంత ఎగ్జైటింగ్ గా చూస్తానని తెలియజేశారు. అయితే ఈ విషయంపై ప్రతి ఒక్కరు స్పందించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: