సమంత యశోద.. ఏంటీ స్పీడు బాసు..!

shami
స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు వరుస క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ సత్తా చాటుతుంది. గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేస్తున్న సమంత ఆ సినిమాతో పాటుగా లేటెస్ట్ గా యశోద అనే సినిమా ఫిక్స్ చేసుకుంది. హరి, హరీష్ అనే దర్శక ద్వయం ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా మొదటి షెడ్యూల్ డిసెంబర్ 24తో పూర్తయినట్టు తెలుస్తుంది.
అంతేకాదు రెండో షెడ్యూల్ జనవరి 2 నుండి 12 వరకు ప్లాన్ చేశారట. థర్డ్ షెడ్యూల్ కూడా జనవరి 20 నుండి 31 వరకు ఉంటుందని.. ఆ షెడ్యూల్ తో సినిమా పూర్తి అవుతుందని చెబుతున్నారు నిర్మాతలు. అసలు డిసెంబర్ లో మొదలు పెట్టడం జనవరి తో పూర్తి చేయడం కేవలం రెండు నెలల్లోనే సమంత యశోద షూటింగ్ పూర్తి చేసుకుంటుందని చెప్పొచ్చు. ఎంచుకున్న కథను చాలా పర్ఫెక్ట్ గా తీస్తున్నారట. దర్శకులు కొత్త వారైనా సరే బాగా చేస్తున్నారని అంటున్నారు.
ఈ సినిమాలో రవలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కూడా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. సినిమా షూటింగ్ జనవరి ఎండింగ్ కి పూర్తయితే రెండు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి సమ్మర్ కల్లా సమంత యశోద రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి సమంత యశోద సినిమా ఇలా స్టార్ట్ చేసి అలా ముగించేస్తుందని చెప్పొచ్చు. రెండు నెలల్లో పూర్తి చేశారు అంటే ఇదేమి భారీ బడ్జెట్ సినిమా కాదని అర్ధమవుతుంది. తెలుగుతో పాటు తమిళం లో కూడా తెరకెక్కుతున్న ఈ సినిమా కన్నడ, మళయాళ భాషల్లో కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటుగా సమంత అమేజాన్ ప్రైం కోసం ఓ వెబ్ సీరీస్ లో కూడా నటిస్తుందని తెలిసిందే. ఎన్.టి.ఆర్ నెక్స్ట్ చేస్తున్న కొరటాల శివ సినిమాలో కూడా సమంత ఫీమేల్ లీడ్ గా చేస్తుందని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: