ఉప్పెన చిత్రంతో బేబమ్మగా ప్రతీ ఒక్కరిని ఆకట్టుకొన్న కృతిశెట్టి తాజాగా
శ్యామ్ సింగరాయ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారని తెలుస్తుంది.తొలి చిత్రంలో గ్రామీణ యువతిగా కనపించిన బేబమ్మ ప్రస్తుతం ఆధునిక యువతగా కనిపించారట.నాని మరియు సాయిపల్లవికి ధీటుగా
కీర్తి అనే పాత్రలో ప్రేక్షకులను మెప్పించారట.. ఈ సందర్భంగా మీడియాతో కృతిశెట్టి మాట్లాడుతూ..
ఉప్పెన సినిమాలో బేబమ్మ పాత్రకు
శ్యామ్ సింగరాయ్ సినిమాలోని
కీర్తి పాత్రకు ఎలాంటి పోలికలు లేవని ఉప్పెన తర్వాత బేబమ్మ లాంటి పాత్రలు వచ్చాయని కానీ నేను వాటిని రిజెక్ట్ చేశానని
శ్యామ్ సింగరాయ్
సినిమా కోసం దర్శకుడు రాహుల్ కథ చెప్పినప్పుడు మోడరన్
అమ్మాయి పాత్ర నాకు బాగా నచ్చిందట ఆ పాత్ర కోసం రీసెర్చ్ చేశానని అలాగే
హాలీవుడ్ సినిమాలు కొన్ని చూశానని మోడల్స్ మేనరిజం పరిశీలించానని అలా నా బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలని అనుకొన్నానని ఈ పాత్ర కోసం రకరకాలుగా లుక్ టెస్ట్ జరిగాయని కొత్తగా ట్రై చేయాలని ఈ పాత్రను చేశాను అని కృతిశెట్టి తెలిపారట..
తల్లి లేని అమ్మాయిగా నటించాలని చెప్పారని అలాగే తల్లి లేకపోవడం వల్ల గడుసుతనం ఉండే అబ్బాయిగా నటించాలని చెప్పారట అయితే
సిగరెట్ తాగడం ఈ సినిమాలో ఛాలెంజ్ అనిపించిందట నాకు పొగతాగడమంటే నాకు ఇష్టం ఉండదని అందుకే షూటింగ్‌కు ముందు రాహుల్‌ను కలిసి సిగరేట్ తాగే సీన్ ఎందుకు తీసేయడానికి అవకాశం ఉందా? అంటే.. ఆ పాత్రకు అదే స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పారట.
ఆ పని చేసేది నీవు కాదు కదా
కీర్తి పాత్ర కోసం మీరు చేయాల్సిదే అని చెప్పారట.. షూటింగ్‌కు రెండు రోజుల ముందు అసిస్టెంట్
డైరెక్టర్ మింట్ సిగరెట్లు తెచ్చి ప్రాక్టీస్ చేయించారట.. ఫస్ట్ టైమ్ తాగేటప్పుడు చేతులు వణికాయని షూటింగ్లో పర్ఫెక్ట్గా చేశాను అని కృతిశెట్టి అన్నారట.
ఉప్పెన సమయంలో అంతా కొత్తవాళ్లే. అప్పుడు పెద్దగా భయం అనిపించలేదని కానీ
శ్యామ్ సింగరాయ్ కోసం నానిని కలిసేటప్పుడు నాకు భయం వేసిందని కానీ షూటింగులో ఆయన అందించిన సహకారం మాటల్లో చెప్పలేమని సెట్లో అందరి పెర్ఫార్మెన్స్ను చూసి బాగుందా లేదనే విషయాన్ని చెబుతాదట.అందరికి సలహాలు, సూచనలు ఇస్తారట ఆయన సపోర్ట్ వల్లనే స్క్రీన్ మీద నా పాత్ర పండిందని అనుకొంటున్నాను అని కృతిశెట్టి తెలిపారట.
శ్యామ్ సింగరాయ్‌లో బోల్డ్ సీన్లు మరియు లిప్‌లాక్ సీన్లు అందరికి బ్యాడ్ అనిపిస్తాయని కానీ నటిగా నేను వాటిని తీసుకొనే తీరును బట్టి మంచి చెడు ఉంటుందని సినిమాలో నా పాత్ర బిహేవ్ చేయాల్సింది చేశానని యాక్షన్ సీన్లలో కూడా అందరూ నటిస్తారని యాక్షన్ సీన్ల మాదిరిగానే బోల్డ్ సీన్లు మరియు లిప్ లాక్ సీన్లను భావించానని ఏ సీన్ అయినా నటించడమే అని కృతిశెట్టి చెప్పారట..