సమంత ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజిగా ఉంది. మరో వైపు ఐటమ్ సాంగ్స్ చేస్తూ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.. మొన్నీమధ్య విడుదలైన అల్లు అర్జున్ భారీ బడ్జెట్ చిత్రం పుష్ప లో స్పెషల్ సాంగ్ లో నటించి మంచి టాక్ ను అందుకుంది. ఇప్పుడు ఒక సినిమా చెస్తూనె మరో సినిమాకు సైన్ చేస్తూ బిజిగా ఉంది. గత కొన్నెల్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ముద్దుగుమ్మ ఇలా వరుసగా సినిమాలు చేయడం పై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు సినిమాలు, మరోవైపు యాడ్ లు చేస్తూనే వెబ్ సిరీస్ లను కూడా చెస్తుంది. ఇటీవల అమ్మడు నటించిన 'ద ఫ్యామిలీ మేన్ 2'లో స్లీపర్ సెల్‌గా నటించి మెప్పించిన సమంత ఇప్పుడు మరో వెబ్ సిరిస్ లో నటించ బోతుంది.ఈసారి కాస్త బోల్డ్ గా కనిపించెందుకు రెడీ అవుతుందని సినీ వార్గాల్లొ వినిపిస్తోంది.మరో హిందీ వెబ్ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 'అవెంజర్స్' తీసిన రసో బ్రదర్స్ ప్రస్తుతం 'సిటాడెల్' అనే అమెరికన్ యాక్షన్ సిరీస్ తీస్తున్నారు. అందులో ప్రియాంకా చోప్రా హీరోయిన్. ప్రస్తుతం అది అమెరికాలో షూటింగ్ జరుపుకుంటుంది..
వచ్చే ఏడాది లోగా పూర్తీ చేసి ఎప్రిల్ లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. ఇక ఈ వెబ్ సిరీస్ ను హిందీలో కూడా తీసేందుకు అమెజాన్ భారీ ప్లాన్లు వేస్తుంది. అందుకోసం కసరత్తులు కూడా చేస్తున్నట్లు సమాచారం.ఫ్యామిలీ మేన్' తీసిన రాజ్, డీకేలకు ఆ బాధ్యత అప్పగించింది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్ పాత్రలో సమంత ను ఒకే చేసినట్లు తెలుస్తుంది.ఇద్దరూ రా ఏజెంట్స్‌గా కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఈ సిరిస్ సెట్ మీదకు వెల్లనుంది. ఇది కాక తాప్సీ నిర్మించనున్న ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీలోనూ సమంత నటించనుందనే వార్త చక్కర్లు కోడుతుంది. బాలివుడ్ లో కూడా పాపులర్ అవ్వడానికి సామ్ ప్రయత్నిస్తుందని తెలుస్తుంది..