వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్ళే..!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను పెంచుకున్న ఈ హీరో ప్రస్తుతం రాదే శ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి చేసాడు, ఈ సినిమా జనవరి 14వ తేదిన విడుదల కాబోతుంది, ఈ సినిమాతో పాటు ప్రభాస్ సలార్, ఆది పురుష్, ప్రాజెక్టు కే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు, అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలో నటించడానికి ప్రభాస్ రెడీ గా ఉన్నాడు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు, ఈ సినిమాను ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించింది, ఈ సినిమాలతో పాటు చిరంజీవి గాడ్ ఫాదర్, బోలా శంకర్, బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు, అలాగే వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి రెడీగా ఉన్నాడు.
మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో రవితేజ కూడా ఈ సినిమా ఇచ్చిన జోష్ లో వరుస సినిమాలను లైన్ లో పెడుతూ ముందుకు దూసుకుపోతున్నాడు, రవితేజ ప్రస్తుతం ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా సినిమాలలో నటిస్తున్నాడు, అలాగే రావణాసుర, టైగర్ నాగేశ్వర్ రావు సినిమాల్లో నటించడానికి రెడీగా ఉన్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తున్నాడు, అలాగే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించబోతున్నాడు, వీటితో పాటు భగవదియుడు భగత్ సింగ్ సినిమాలో మరియు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి రెడీగా ఉన్నాడు.