'పుష్ప'రాజ్ వసూళ్లు తగ్గేనా... ?
బాక్స్ ఆఫీస్ సమాచారం ప్రకారం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఓల్డ్ వైల్డ్ 105.35 కోట్ల వరకు పోగు చేసిందని సమాచారం. అయితే కొన్ని కథనాల ప్రకారం ఈ సినిమా పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోతోంది అంటూ ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇండస్ట్రీకి సంబందించిన సోషల్ మీడియాలు మరియు ఇతర మీడియాల సమాచారం మేరకు పుష్ప సినిమా అనుకున్న విధంగానే హిట్ టాక్ తో వసూళ్లను రాబట్టడంలో తన జోరు చూపిస్తుంది అని తెలుస్తోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా 'ముత్తంశెట్టి మీడియా' సంస్థతో కలిసి 'మైత్రి మూవీ మేకర్స్' వారు భారీ బడ్జెట్ తో నిర్మించడం జరిగింది.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో వచ్చిన ఈ సినిమా పాటలు ఉర్రూతలూగిస్తున్నాయి. మొదటి నుండి ఈ సినిమా విశేషాలు పోస్టర్స్, టీజర్, పాటలు, ట్రైలర్లు వంటివి సినిమాపై భారీ అంచనాలు పెరిగేలా చేశాయి. దీంతో ఈ సినిమా బిజినెస్ కూడా భారీ స్థాయిలో ఊపందుకుంది. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా మిశ్రమ టాక్ ను తెచ్చుకుంటున్నప్పటికీ స్టైలిష్ స్టార్ తన మ్యానియా జోరు చూపుతూ వసూళ్ల మోత మోగుతుంది. అయితే ఈ రోజు నాని సినిమా శ్యాం సింగ రాయ్ విడుదలైన సంగతి తెలిసిందే. మోడైట్ షో నుండే హిట్ టాక్ తో దూసుకువెళుతోంది. మరి దీని ప్రభావం పుష్ప పై పడుతుందా అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.