రాధే శ్యామ్ : అంచనాలు ఎందుకురా పెంచుతారు?

RATNA KISHORE


బాబోయ్ ఏ వేడుక‌కు కూడా నిర్మాత దిల్ రాజు రాకూడ‌దు అన్నంత రేంజ్ లో నిన్న ప్ర‌చార ప‌టాటోపం ఉంది. ఎందుక‌ని అంత‌టి హైప్ ఇచ్చి ఓ ప్రొడ్యూస‌ర్ మాట్లాడ‌డం.. దాని వ‌ల్లే సినిమాకు న‌ష్టం అని తెలుసుకోరా?



ఒక సినిమా హిట్ కావాలని కోరుకోవ‌డం త‌ప్పేం కాదు..ఆ సినిమా హిట్ కావ‌డానికి ప్ర‌చార ప‌ర్వం ఓ ఉప‌యోగ‌కారి అయితే ఇంకా మేలు. కానీ కొన్ని సార్లు అన‌స‌వ‌రంగా సినిమాపై అంచ‌నాలు పెంచి, త‌రువాత ఇబ్బందుల్లో ప‌డ‌డం ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణా మాల‌కు సంకేతం. అవును! ప్ర‌భాస్ గ‌త సినిమాల విష‌యంలో కూడా ఇలానే అతిగా ప్ర‌చారం చేసి, అంచ‌నాలు పెంచి త‌రువాత ని రుత్సాహ ప‌రిచిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యం లో రేపు రాబోతున్న రాధే శ్యామ్ చిత్రానికి సంబంధించి నిన్న జ‌రిగిన వేడుక కూడా అలానే ఉంది.

ఒక సినిమా హిట్ అయినా లేదా హిట్ అయ్యేందుకు దారి తీసిన ప‌రిణామాలు విశ్లేషించినా ముందుగా ఒప్పుకోవాల్సింది క‌థ ఎలా ఉంద‌ని.. బాగుంటే బాగుంద‌ని లేదంటే లేద‌ని.. ఈ క‌థ‌కు ఐదేళ్లు వ‌ర్క్ చేయ‌డం బాగుంది.. మ‌రి ఆ స్థాయిలో సినిమా ఉండాల‌ని కోరుకోవ‌డం త‌ప్పేం కాదు కానీ మీ అంద‌రూ ఊహించ‌ని స్థాయిలో ఈ సినిమా ఉంటుంద‌ని చెప్ప‌డం మాత్రం ప్ర‌భాస్ కు భావ్యం కాదు. గ‌తంలో రెబ‌ల్, త‌రువాత సాహో ఇలాంటి సినిమా విష‌యంలో ఇలా చెప్పే దారుణం అయిన ప‌రాజయాలు ఆయ‌న పొందారు.

నిన్న రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రిగిన వేడుక‌ల్లో ప్ర‌భాస్ మాట్లాడిన విధానం ప‌రిమిత స్థాయిలో ఉన్నా కొన్ని మాత్రం మ‌రీ హై పిచ్ లో ఉన్నాయి. ఎందుకు ఈ సినిమా అంత గా హ‌డావుడి చేయాలి.. కృష్ణం రాజు అనే వ్య‌క్తి ఎందుకు అంత హైప్ పెంచేయ్యాలి.. అంటే ఇప్పుడు ఆయ‌న ఏ సినిమా చేసిని ప్యాన్ ఇండియానే క‌నుక ఆ రేంజ్ లో ప్ర‌తిసారీ ప్ర‌తి సినిమా వ‌స్తుంద‌ని అలా రాక‌పోతే అభిమాని అనేవాడికి నిరాశ త‌ప్ప‌ద‌ని తేల్చేశారా ఏంటి? ఎందుకు వ‌చ్చిన గొడ‌వ అంత హంగామా చేసి ప్ర‌భాస్ ను ఓ రేంజ్ లో పొగిడేసి త‌రువాత సినిమాపై ఆ మాటల ప్ర‌భావం ఉంటే ఏం చేస్తార‌ని? ఫ‌లితం బాగున్నాక మాట్లాడొచ్చు కానీ ఫ‌లితం ఇలా ఉంటుంది అని ముందే అంచ‌నా వేసి మ‌రీ అతిగా మాట్లాడ‌డం ఇటీవ‌ల దిల్ రాజు నేర్పిన పాఠంలా ఉందే! అంత అవ‌స‌ర‌మా? 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: