రంగస్థలం 2 ను అనౌన్స్ చేసిన సుక్కు..!

Satvika
తెలుగు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినెషన్ లో వచ్చిన హ్యాట్రీక్ మూవీ పుష్ప.. ఈ సినిమా ఈ నెల 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వారం రోజులలో కాసుల వర్షంలో చిత్ర యూనిట్ తడిసి ముద్దయిపోయింది. మాస్ అభిమానులకు స్ట్రాంగ్ ట్రీట్ ను సుక్కు ఇచ్చాడు.అయితే కొన్ని విమర్శలు ఎదురైనా కూడా చిత్ర యూనిట్ పెద్దగా పట్టించుకోలేదు. వచ్చే ఏడాది మిడిల్ నుంచి పుష్ప 2 సినిమాను తెరకెక్కించే ఆలోచన ఉందని సుక్కు అన్నాడు.
.

ఇంటర్వ్యూ లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి నోరువిప్పారు. అందరు ఎంతగానో ఎదురుచూస్తున్న కాంబో రామ్ చరణ్ ,సుకుమార్ . రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ ని చెర్రీ కి అందించిన సుకుమార్ తన తదుపరి సినిమాలో ఒకటి రామ్ చరణ్ తో ఉండనుందని చెప్పాడు. అంటే సుక్కు లెక్క ప్రకారం రంగస్థలం సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతూంది. ఈ కాంబినెషన్ మళ్ళీ రచ్చ చేయడం ఖాయం. అప్పుడే సుక్కుకు టైం వస్తుందని మెగా అభిమానులు అంటున్నారు.


సుక్కు లైఫ్ ను టర్న్ చేసిన సినిమాలలొ ఇది ఒకటి. న్యాచురల్ గా తీసిన ఈ సినిమా జనాలకు బాగా కనెక్ట్ అయింది. రామ్ చరణ్ పాత్ర సినిమాకు ప్రాణం పోసింది. సమంత కూడా ఎక్కడా తగ్గకుండా నటించింది. సినిమా మొత్తం జనాలకు నచ్చింది. అయితే సుక్కు మరో హీరో తో చేయనున్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో సినిమా ను సెట్స్ పై తీసుకెల్లె ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమా పుష్ప 2 తరువాత మొదలు కానున్నదట. ఇప్పటికే సుకుమార్ హీరోలు ఏ రేంజ్ లో ఉంటారో అందరికి తెలిసిందే.. విజయ్ ను సుక్కు ఎలా చూపిస్తాడో అని జనాలు ఆసక్థిగా ఉన్నారు.విజయ్ లైగర్ సినిమా షూటింగ్ లో వున్నాడు. ఆ సినిమా అయ్యాక ఇది చేస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: