షారుక్ ఖాన్ మరియు దీపికా పదుకొనే కలిసి నటించిన
చెన్నై ఎక్స్
ప్రెస్ సినిమాలోని లుంగీ డాన్స్ పాట ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని అప్పట్లో చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల నోటివెంట లుంగీ డాన్స్ లుంగీ డాన్స్ అనే పాట వినపడేదట .
అలాగే ఏ పార్టీలో చూసినా ఏ ఫంక్షన్ లో చూసిన ప్రతి ఒక్కరు ఈ పాటకు అద్భుతమైన స్టెప్పులు వేసేవారని తెలుస్తుంది.ఆ విధంగా లుంగీ డాన్స్ పాట ఎంతో ఫేమస్ అయిందట.ఇకపోతే తాజాగా
బాలీవుడ్ పోర్న్ స్టార్ సన్నీలియోన్ లుంగీ కట్టి అద్భుతమైన స్టెప్పులతో లుంగీ డాన్స్ ఇరగదీసిందట..ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఆమె డాన్స్ కు
ఫిదా అయిపోయారట. సన్నీలియోన్
బాలీవుడ్ ఇండస్ట్రీలో పోర్న్ స్టార్ గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఈ
బ్యూటీ తెలుగులో కూడా పలు చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను కూడా దక్కించుకున్నారట. ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మ '' ఓ మై ఘోస్ట్ '' అనే చిత్రం ద్వారా
కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందట.ప్రస్తుతం ఈ
సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుందని సమాచారం.ఈ క్రమంలోనే ఈ
సినిమా షూటింగ్ లో భాగంగా లుంగీ డాన్స్ పాటకు డాన్స్ వేసి అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారట.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని సమాచారం.
సన్నీలియోన్ పలు చిత్రాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి గుర్తింపు పొందారట ఈ క్రమంలోనే ఈ
బ్యూటీ గతంలో ''
కరణ్ జీత్ కౌర్ : ది అన్ టోల్డ్ స్టోరీ '' అనే వెబ్‌సిరీస్‌లో నటించిందట.అయితే ఈ సిరీస్ తన
జీవిత కథ ఆధారంగా తెరకెక్కడంతో రియల్ పాత్రలో నటించిందట . ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ జీ 5 లో అందుబాటులో ఉందట. ఇక ప్రస్తుతం
బాలీవుడ్,
కోలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న
సన్నీ లియోన్ గత కొద్ది రోజుల క్రితం ముంబైలో ఒక ఫ్లాట్ కొనుగోలు చేసి అక్కడే నివాసం ఉంటున్న విషయం అందరికి తెలిసిందే.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను తన ఫోటోలను వీడియోలను సోషల్
మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారట.ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలుస్తుంది..ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఎంతో మంది ఈమె డాన్స్ పై ప్రశంసల వర్షం కురిపించారని తెలుస్తుంది..