ఆఫర్లు లేక ఈవెంట్ల బాట పట్టిన యంగ్ హీరోయిన్?

VAMSI
ఎన్నో ఆశలు, తన బంగారు భవిష్యత్తు పై అంచనాలతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఒక హీరోయిన్ మూడు, నాలుగు సినిమాలు చేశాక ఎంతో వెయిట్ చేస్తూ ఒక్క అవకాశము కూడా రాకపోవడంతో ప్రస్తుతం ఈవెంట్స్ కు వెళుతున్నారట. టీవి షోస్, స్పెషల్ ప్రోగ్రామ్స్ ఇలా కాస్త మంచి అవకాశం వస్తే చాలు వేరే దారిలేక చేస్తున్నారట. సినీ రంగం అంటే ఎవరికి ఇష్టం ఉండదు...కొందరు వెండి తెరపై సినిమాలు చూడాలని ఆశపడితే, ఇంకొందరు సిల్వర్ స్క్రీన్ పై తాము కనిపించాలని ఆశపడుతుంటారు. అయితే అందరికీ ఆ అవకాశం దొరకదు. అదృష్టం, అవకాశం కలిసి వస్తే వద్దన్నా సినిమా ఛాన్స్ మిమ్మల్ని వరించవచ్చు.

ఇక సినీ రంగంలో వెలిగిపోవాలని ఎందరో నటులు ఎంతో ఆశగా ఇండస్ట్రీకి వస్తారు. కొందరు ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ తో వస్తే   ఇంకొందరు ఎటువంటి సినీ బ్యాగ్ గ్రౌండ్ లేకపోయినా లక్ ఇంకా టాలెంట్ తో అనూహ్యంగా అవకాశాలను అందుకుంటారు. అయితే ఇలా సినీ పరిశ్రమకు వచ్చిన కొందరు తమ టాలెంట్ తో దూసుకుపోతుంటే మరికొందరు మాత్రం కాలం కలిసి రాక అవకాశాలు రాకపోవడంతో వెనుతిరుగుతారు. ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు..?? ఎపుడు..?? ఏ పొజిషన్ కు చేరుకుంటారో చెప్పడం కష్టమే.

ఇప్పుడు టాలీవుడ్ కి చెందిన ఒక హీరోయిన్ సరైన అవకాశాలు లేకపోవడంతో చిన్న చిన్న ఈవెంట్స్ కు వెలుతుతోందట. అయితే ఈ మధ్య రెండు మూడు కథలు తన దగ్గరకు వచ్చినా తిరస్కరించింది అని తెలుస్తోంది. తనకు హిట్ వచ్చే కథలనే ఎంపిక చేస్తానని పట్టుబట్టుకు కూర్చుందని వినికిడి.  తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈమె ఒక యంగ్ హీరోయిన్ అని తెలుస్తోంది. ఈమె పూర్తి వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మరి ఇక ముందైనా మంచి అవకాశాలు వచ్చి జోరు చూపుతుందా అన్నది తెలియాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: