నాచురల్ స్టార్ నాని తాజా గా నటించిన చిత్రం శ్యామ్ సింగరాయ్, ఈ సినిమా లో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్ లుగా నటించారు, ఈ సినిమాకు టాక్సీ వాలా సినిమా తో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న రాహుల్ సాంకృత్యయన్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్ర మే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలు పెంచేశాయి, ఇలా ఇప్పటికే జనాలలో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా ను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24 వ తేదీ న విడుదల చేయబోతున్నారు, ఈ సినిమా ను తెలుగు లో మాత్రమే కాకుండా కన్నడ, మలయాళం, తమిళ్ భాషలలో ఒకే సారి విడుదల చేయబోతున్నారు.
ఈ సినిమా లో సాయి పల్లవి దేవదాసి పాత్రలో కనిపించబోతుంది, ఈ పాత్ర చాలా గొప్పగా ఉండబో తోందని తెలుస్తోంది, అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటం తో ఈ చిత్ర బృందం పలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లలో అలాగే సోషల్ మీడియా ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ సినిమా ను ప్రమోట్ ఏం చేస్తున్నారు, అయితే తాజా గా నాని ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ... యాంకర్ అడిగిన ప్రశ్న కు నాని సమాధానం ఇస్తూ... ఈ సినిమా కు కమల్ హాసన్ హీరో గా తెరకెక్కిన నాయకుడు సినిమా కు ఎలాంటి సంబంధం లేదు, అలాగే ఈ సినిమా కోసం నేను ఏ మాత్రం బరువు పెరగలేదు, మీకు అలా కనిపించి ఉంటుంది అంతే, ఈ సినిమా కోసం నేను బరువు తగ్గడం, పెరగడం అలాంటివి ఏమి చేయలేదు అని నాని తెలియ జేశాడు.