సుకుమార్, అల్లు అర్జున్ కాంబినెషన్ లో వచ్చిన సినిమా పుష్ప.. పుష్ప రాజ్ పాత్ర లో బన్నీ నటించగా, పల్లెటూరి అమ్మాయి శ్రీ వళ్లి పాత్రలో రష్మిక మందన్న నటించింది. మాస్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే.. మొదటి రోజులోనే భారీ కలెక్షన్స్ ను అందుకుంది. ఇప్పుడు టాక్ ఆఫ్ టాలివుడ్ అయ్యింది. మొత్తానికి వీరి సినిమా భారీ హిట్ అవ్వడం తో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసి మరోసారి సక్సెస్ ను అభిమానుల తో పంచుకున్నారు.
ఇప్పటికే చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు ఈ విషయం పై స్పందించి పుష్ప టీమ్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.పుష్ప మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతుంది. సినిమా విడుదల అయిన మొదటి నాలుగు రోజులకే 200 కోట్లు పైనే వసూల్ చేసింది. కలెక్షన్స్ పై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ విషయం పై కొందరు తప్పుడు ప్రచారాలను కూడా చేశారు. కానీ పుష్ప టీమ్ నెగిటివ్ గా స్పందించలేదు.
తాజాగా ఈ విషయం పై హీరో సిద్దార్థ్ స్పందించారు. గత కొన్నెల్లుగా సినీ ఇండస్ట్రీ తప్పుడు లెక్కలు చెప్పి అభిమానులను మోసం చేస్తుందని ఆరొపించారు. ఇప్పుడు పుష్ప కలెక్షన్స్ విషయం లో కూడా అదే జరిగిందని వెల్లడించారు.. ట్రేడ్ వర్గాలు మరియు మీడియా వారు కూడా వారు చెప్పినట్లు వసూల్లు చెబుతున్నాయి. ఇండస్ట్రీ కి ఇందులో సంబంధం లేదు.. అని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన అన్నమాట బన్నిని ఉద్దెషించి అని తెలుస్తుంది.ఎప్పుడూ లేనివిధంగా సిద్ధార్థ ఇలా ఎందుకు అల్లు అర్జున్ సినిమా పై కామెంట్స్ చేస్తున్నాడు అని అల్లు ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు.ఇది నెట్టింట వైరల్ అవుతుంది. ఈ విషయం పై పుష్ప టీమ్ కూడా పెద్దగా స్పందించలేదని తెలుస్తుంది.