టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా బంగార్రాజు, ఈ సినిమా లో అక్కినేని నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో అక్కినేని నాగ చైతన్య నటిస్తూండగా, నాగ చైతన్య కు జంటగా కృతి శెట్టి నటిస్తోంది, ఈ సినిమా 2015 సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే బంగార్రాజు సినిమా కు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి, ఈ సినిమాకు సంబంధించిన రెండు లిరికల్ పాటలను చిత్ర బంధం విడుదల చేయగా అందులో ఫారియా అబ్దుల్లా చేసిన స్పెషల్ సాంగ్ కూడా ఉంది, ఫారియా అబ్దుల్లా తో మాత్రమే కాకుండా మరి కొంత మంది హీరోయిన్ లతో కూడా ఈ సినిమా లో ప్రత్యేక పాట లను చిత్రీకరి స్తున్నారు తెలుస్తుంది.
ఇలా ఒక సాంగ్ తర్వాత ఒక సాంగ్ ను విడుదల చేస్తూ ప్రమోషన్ ల జోరు పెంచిన ఈ చిత్రం బృందం బంగార్రాజు సినిమా ను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది, దానికి ప్రధాన కారణం సోగ్గాడే చిన్నినాయన సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీసు దగ్గర బ్లాక్ బాస్టర్ అవడమే, సోగ్గాడే చిన్నినాయన సినిమాను విడుదల చేసిన జనవరి 15 వ తేదీ నే బంగార్రాజు సినిమాను కూడా విడుదల చేయాలనే ఆలోచన లో చిత్ర బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా మరో రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది, ఇలా బంగార్రాజు సినిమా సోగ్గాడే చిన్నినాయన సెంటిమెంట్ ను ఫాలో అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.