షాకింగ్ సమంతకు ఎందుకుని ఇలా !
ప్రస్తుతం సమంత జీవితంలో ఒడుదుడుకులు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ పరిస్థితులతో రాజీపడకుండా తన ఇమేజ్ ని మరింత పెంచుకోవడానికి తనవంతు ప్రయత్నం చేస్తూ ఆమె ప్రస్తుతం సోషల్ మీడియాలో మరింత చైతన్యవంతంగా కొనసాగుతోంది.
ఇలాంటి పరిస్థితులలో సమంత ఇన్ ష్టాగ్రామ్ ఎకౌంట్ లో షేర్ చేసిన ఒక ఫోటో వైరల్ గా మారడంతో ఆ ఫోటోను చూసిన సమంత అభిమానులు కొంత కలత పడుతున్నారు. క్రితం సంవత్సరం క్రిస్మస్ ను సమంత నాగచైతన్యతో కలిపి చేసుకుంది. అయితే ఈసారి ఆమె తన ఇంటిలో ఏకాంతంగా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చైతన్యతో విడిపోయిన తరువాత ఆమధ్య తన స్నేహితులతో విహారయాత్రలు చేసి వచ్చిన సమంత ఈసారి క్రిస్మస్ ను తనకు ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్కలతో కలిపి చేసుకోబోతోంది.
సమంతకు తన పెంపుడు కుక్కలు హాష్ సాషా లు అంటే విపరీతమైన ఇష్టం ప్రస్తుతం తనకు ఉన్న ఏకాంతంలో హాష్ సాషా లు మాత్రమే తన కంపానియన్స్ అంటూ హైదరాబాద్ లోని తన ఇంట్లో పెంపుడు కుక్కలతో కలిసి ఉన్న ఒక ఫోటోను అదేవిధంగా తన జీవితం ఎలా ఉందో తెలియచేస్తూ ఒక వీడియోను షేర్ చేసింది. ‘క్రితం క్రిస్మస్ నేను మీకు నా హృదయ గీతాన్ని అందించాను’ అంటూ ఒక భావయుక్తమైన కొటేషన్ ను షేర్ చేసింది. ప్రస్తుతం సమంత నటిస్తున్న ‘శాకుంతలం’ మూవీతో తనకు పాన్ ఇండియా ఇమేజ్ వస్తుందని రాబోతున్న క్రిస్మస్ గురించి ఎన్నో కలలు కంటోంది..