బోయపాటి తో పవన్ చర్చలలోని ఆంతర్యం ?
పవన్ నటించిన మూవీ ‘భీమ్లా నాయక్’ విడుదలకు రెడీగా ఉంది. ‘హరిహర వీరమల్లు’ సెట్స్ పై ఉంది. ఈసినిమాలు కాకుండా హరీష్ శంకర్ ‘భవధీయుడు భగత్ సింగ్’ పవన్ డేట్స్ కోసం ఎదురు చూస్తోంది. ఈసినిమాలు ఇలా ఉండగానే నిర్మాత భగవాన్ పుల్లారావ్ కు పీపుల్స్ మీడియాకు అదేవిధంగా రామ్ తాళ్ళూరి కి పవన్ ఇంకా మూడు సినిమాలు చేయవలసి ఉంది.
ఈసినిమాల పరిస్థితి ఇలా ఉండగానే బోయపాటి పవన్ ల కాంబినేషన్ లో ఒక సినిమాను తీయడానికి ఒక ప్రముఖ నిర్మాత గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ వస్తున్న వార్తలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. ఒక పవర్ ఫుల్ పొలిటికల్ సబ్జెక్ట్ బోయపాటి దృష్టిలో ఉందని ఆ కథకు పవర్ స్టార్ ఒకే చెపితే ఆమూవీని చేయడానికి తాను ఓకె అంటూ బోయపాటి అభిప్రాయపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా బోయపాటి పవన్ ల కాంబినేషన్ అంటే ఒక రేంజ్ లో ఉంటుందని అందువల్ల ఆమూవీ బ్లాక్ బష్టర్ హిట్ అవ్వడం ఖాయం అంటూ అభిమానులు అప్పుడే సంబరపడిపోతున్నారు. పవన్ ప్రస్తుతం తన కెరియర్ లో ఎప్పుడు లేని విధంగా వరసపెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నాడు. వచ్చే ఎన్నికల లోపు 400 కోట్ల టార్గెట్ సంపాదన పై పవన్ అడుగులు వేస్తున్నాడు అంటూ వార్తల హడావిడి మొదలైంది.
అయితే పవన్ సినిమాలను ప్రారంభిస్తాడు కాని ఆసినిమాలను వేగంగా పూర్తి చేసే విషయంలో కొద్దిగా అలసత్వం వహిస్తాడు అన్న ప్రచారం ఉంది. ప్రస్తుతం మీడియాలో హడావిడి చేస్తున్న సినిమాల లిస్టును పవన్ నిజంగానే పూర్తి చేయగలిగితే కనీసం సంవత్సరానికి రెండు సినిమాలు పవన్ వైపు నుండి వచ్చే ఎన్నికల లోపు విడుదలయ్యే ఆస్కారం ఉంది. ఇలా అద్భుతం జరగాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నప్పటికీ క్షణానికి ఒక ఆలోచన చేసే పవర్ స్టార్ రానున్నరోజులలో ఎలా వ్యవహరిస్తాడో చూడాలి..