బాలకృష్ణ 'వేటపాలెం'లో మాస్ రాజా..?

shami
అఖండ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య బాబు తను ఆహాలో చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో ఆ ఉత్సాహం చూపిస్తున్నారు. రీసెంట్ గా రాజమౌళి, కీరవాణి ఇంటర్వ్యూతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ నెక్స్ట్ ఇంటర్వ్యూ మాస్ మహరాజ్ రవితేజ, డైరక్టర్ గోపీచంద్ మలినేనితో చేస్తున్నారు. రవితేజ, బాలకృష్ణ అసలు ఎవరు ఊహించని ఈ కాంబో సెట్ చేశారు ఆహా టీం. అయితే ఆహా టీం కన్నా ముందు డైరక్టర్ గోపీచంద్ మలినేని ఈ కాంబో ఆలోచనలో ఉన్నారట.
ప్రస్తుతం గోపీచంద్ మలినేని బాలకృష్ణ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజని కూడా ఓ కెమియో రోల్ చేయిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. రవితేజతో డాన్ శీను, బలుపు సినిమాలు చేసిన గోపీచంద్ మలినేని ఈ ఇయర్ మొదట్లో క్రాక్ అంటూ వచ్చి సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం బాలయ్యతో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో సినిమా తీస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో స్టార్ హీరో నటిస్తే బాగుంటుందని అనుకున్నాడట. అదే విషయాన్ని రవితేజ దగ్గర ప్రస్థావిస్తే తాను చేసేందుకు రెడీ అన్నాడట.
బాలకృష్ణ కూడా రవితేజ అయితే సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పారట. అలా బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాలో రవితేజ నటిస్తున్నారని టాక్. అయితే దీనిపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. రవితేజ ప్రస్తుతం ఖిలాడి మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమా తర్వాత రామారావు ఆన్ డ్యూటీ.. నక్కిన త్రినాథ రావుతో మూవీ.. సుధీర్ వర్మ రావణాసుర సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఈ సినిమాలతో పాటుగా బాలకృష్ణ సినిమాలో ఓ చిన్న పాత్ర చేస్తున్నట్టు తెలుస్తుంది. గోపీచంద్ మలినేని, బాలకృష్ణ కాంబో సినిమాకు వేటపాలెం టైటిల్ ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట. సినిమాలో కమల్ గారాల పట్టి శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: