బిగ్ బాస్ 5 : షణ్ముఖ్ జశ్వంత్.. మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్ ..!

shami
యూట్యూబర్ గా బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టిన షణ్ముఖ్ తనకు ఉన్న సోషల్ మీడియా క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ 5 రన్నరప్ గా నిలిచాడు. మొదటి నుండి టైటిల్ రేసులో ఉన్న అతను తప్పకుండా విన్ అవుతాడని అనుకోగా మధ్యలో సిరితో సైడ్ ట్రాక్ వెళ్లిపోవడంతో అతను టైటిల్ కు దూరమయ్యాడు. సిరితో ఎమోషనల్ రిలేషన్ వల్లే టైటిల్ రాలేదన్న విషయాన్ని అరియానాతో జరిగిన బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో చెప్పాడు షణ్ముఖ్. అయితే హౌజ్ లో 105 రోజులు ఒక మనిషితో అన్ని షేర్ చేసుకుంటే అలానే ఉంటుందని వు ఆర్ గుండ్ ఫ్రెండ్స్ అని చెప్పాడు షణ్ను.
బిగ్ బాస్ హౌజ్ లో యూట్యూబ్ సూపర్ స్టార్ గా వచ్చిన షణ్ముఖ్ 105 రోజులు 15 వారాల పాటు తన ప్రయాణం సాగించాడు. తన ఫాదర్ నువ్వు 3, 4 వారాలు ఉంటే చాలా గ్రేట్ అని అన్నాడని. కాని తాను 15 వారాలు ఉన్నానని అన్నాడు. ఇదివరకు సీజన్లు చూసినప్పుడు ఎందుకు వీళ్లంత ఎమోషనల్ అవుతున్నారని అనిపించింది కాని ఇక్కడ పరిస్థితులు అలా మారుతాయని అన్నాడు షణ్ముఖ్.
ఇక బిగ్ బాస్ ద్వారా షణ్ముఖ్ జశ్వంత్ భారీగానే రెమ్యునరేషన్ పొందాడని తెలుస్తుంది. వారానికి నాలుగు నుండి ఐదు లక్షల దాకా ఇచ్చారట. అలా చూస్తే 15 వారాల పాటు మొత్తంగా 65 లక్షల దాకా షణ్ముఖ్ జశ్వంత్ కు వచ్చాయని టాక్. అంటే బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గెలిచినంత షణ్ముఖ్ తన రెమ్యునరేషన్ లో సంపాదించాడు. అఫ్కోర్స్ టైటిల్ గెలిస్తే ఆ 50 లక్షలు కూడా ఇందులో యాడ్ అయ్యి ఉండేది. సువర్ణకుటీర్ లో ఓ ప్లాట్ కూడా వచ్చేది. అయితే హౌజ్ లో జరిగిన కొన్ని విషయాల వల్ల తాను టాప్ 2 గా ఉండాల్సి వచ్చిందని. ఆ విషయాన్ని తాను ఒప్పుకుంటానని అన్నాడు షణ్ముఖ్. మొత్తానికి ఓ యూట్యూబర్ గా బిగ్ బాస్ సీజన్ 5 లో షణ్ను తన ఆట తీరుతో అందరిని మెప్పించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: